ఆ వీడియో వైరల్ అయ్యిన తరువాతే పొట్టి దుస్తులు వేసుకోవద్దని ఫిక్స్ అయ్యా.. అసలు కారణం ఏంటో చెప్పిన సాయి పల్లవి..!

ఆ వీడియో వైరల్ అయ్యిన తరువాతే పొట్టి దుస్తులు వేసుకోవద్దని ఫిక్స్ అయ్యా.. అసలు కారణం ఏంటో చెప్పిన సాయి పల్లవి..!

by Anudeep

Ads

సాయి పల్లవి.. ఈమె గురించి పరిచయం అవసరం లేదు. ప్రేమమ్ సినిమా తో ఈ ముద్దుగుమ్మ బాగా పాపులర్ అయింది. మలయాళం లో ఈ సినిమా ఎంత హిట్ అయిందో అందరికి తెలుసు. తెలుగు లో కూడా ఈ సినిమాను రీమేక్ చేసారు. అయితే.. ఈమెకు తెలుగు నాట కూడా పాపులారిటీ రావడం తో టాలీవుడ్ లోను అవకాశాలు వచ్చాయి.

Video Advertisement

ఫిదా, మారి 2, MCA , పడి పడి లేచే వయసు వంటి సినిమాల్లో నటించిన సాయి పల్లవి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. లవ్ స్టోరీ, శ్యామ్ సింగ్ రాయ్ వంటి సినిమాలతో తెలుగు వాళ్ళకి మరింత చేరువైంది.

ఇటీవల జరిగిన “విరాట పర్వం” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ చూస్తే తెలుగు ప్రేక్షకుల్లో సాయి పల్లవికి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందొ అర్ధం అవుతుంది. ఆమెను లేడీ పవర్ స్టార్ గా ప్రేక్షకులు అభిమానిస్తుంటారు. అందుకు తగ్గట్లే ఆమె కూడా హుందాగా వ్యవహరిస్తుంటారు. ఆమె ఎంచుకునే సినిమా ప్రాజెక్ట్ లు, ఈవెంట్ లకు వేసుకునే దుస్తులు.. ఈవెంట్స్ లో ఆమె మాట్లాడే మాటలు.. ఇవన్నీ ఆమె వ్యక్తిత్వానికి మరింత అందాన్నిస్తూనే ఉంటాయి. సాయి పల్లవి గురించి అందరికి తెలిసిన విషయం ఏంటంటే.. ఆమె పొట్టి దుస్తులు వేసుకోవడం, ఎక్స్పోజింగ్, ఇంటిమేట్ సీన్స్ లో నటించడం వంటి విషయాలకు దూరంగా ఉంటారు అని.

అయితే.. అలా ఎందుకు ఇతర హీరోయిన్స్ లా దుస్తులు వేసుకోరు అన్న విషయం చాలా మందికి తెలియదు. ఇటీవలే ఆమె ఈ విషయం గురించి చెప్పుకొచ్చారు. సాయి పల్లవి వైద్య విద్య నేర్చుకోవడం కోసం జార్జియా వెళ్లారట. అక్కడ.. ఆమె తన తల్లితండ్రుల అనుమతితో టాంగో డాన్స్ ను కూడా నేర్చుకున్నారట. ఓ ప్రోగ్రాంలో ఆమె టాంగో డాన్స్ ప్రదర్శన కూడా ఇచ్చారట. అయితే.. ఈ డాన్స్ వేసేటప్పుడు దానికి అనువైన కాస్ట్యూమ్స్ ని మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. సాయి పల్లవి తన పేరెంట్స్ అనుమతి తీసుకున్నాకే ఈ డాన్స్ నేర్చుకుని, ప్రదర్శన ఇచ్చారట.

అయితే.. ఈ డాన్స్ వీడియో యుట్యూబ్ లో కూడా అప్ లోడ్ అయింది. ప్రేమమ్ సినిమా సక్సెస్ తరువాత సాయి పల్లవి చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఈ టాంగో డాన్స్ వీడియో కూడా వైరల్ అయింది. అప్పట్లో ఈ డాన్స్ లో సాయి పల్లవి కాస్ట్యూమ్స్ పై చాలా కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్ ను చూసి సాయి పల్లవి చాలా ఇబ్బంది పడ్డారట. ఇంకెప్పుడు.. సినీ ఇండస్ట్రీ లో ఇలా పొట్టి దుస్తులు వేసుకోకూడదని ఫిక్స్ అయిపోయారట.

Watch Video:


End of Article

You may also like