ఇతర హీరోయిన్స్ కి భిన్నంగా “సమంత” చేసింది ఏంటి.? ఆమె నటన వల్లనా లేక ఆమె సినిమాల ఎంపిక వల్లనా?

ఇతర హీరోయిన్స్ కి భిన్నంగా “సమంత” చేసింది ఏంటి.? ఆమె నటన వల్లనా లేక ఆమె సినిమాల ఎంపిక వల్లనా?

by Anudeep

Ads

సమంత ప్రస్తుతం నేషనల్ లెవెల్‌లో స్టార్డంను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ మెన్ సీజన్ 2తో సమంతకు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే.. అలాగే పుష్పలోని ఐటం సాంగ్‌ ఊ అంటావా మామ అనే పాట వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. దీంతోపాటు సమంత సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది.

Video Advertisement

సమంత సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఇన్ని సంవత్సరాలలో ఎన్నో హిట్స్, ఎన్నో ఫ్లాప్స్ ఉన్నాయి. అయినా సరే సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా సమంత ఒక స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఇంత మంది హీరోయిన్స్ ఉండగా సమంతకి మాత్రమే ఎందుకు ఇంత క్రేజ్ అనే ప్రశ్నకి మౌనిక చిత్తలూరి అనే ఒక ఒక కోరా యూజర్ ఈ విధంగా సమాధానం చెప్పారు.

samantha remuneration for a shopping mall inauguration

#1. ఇక సినిమాల విషయానికి వస్తే.. దాదాపు 50 సినిమాలు చేసింది సమంత. అందులో ఓ బేబీ, మజిలి, అఆ, ఈగ, ఏటో వెళ్ళిపోయింది మనసు, ఏమాయ చేసావే, రంగస్థలం మహానటి, మనం, సన్ అఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్, సూపర్ డీలక్స్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇలా వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు తను గుర్తింపు పొందిన పాత్రలు.

 

#2. రాజుగారి గది 2, యూ టర్న్ ఈ రెండు సినిమాలు రెగ్యూలర్ సినిమాలకు భిన్నంగా ఉంటాయి. ఈ సినిమాల్లో సమంత  కీలక పాత్ర పోషించింది.

 

 

#3. సమంత ఒక క్యూట్ గర్ల్, బబ్లీ గర్ల్ పాత్రలు చేసి ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడవే పాత్రలు కొత్త హీరోయిన్స్ చేస్తుంటే చూడాలనిపించడం లేదు.

#4. తన సోషల్ మీడియాలో అభిమానులతో అలాగే ఫ్రెండ్స్ తో సామ్ ఎక్కువ క్లోజ్ గా ఉంటుంది. ఒక బిజినెస్ విమెన్ లాగా ఉండదు.

#5. సమంత తన జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకుంది. వ్యక్తిగత జీవితం, వ్యాపారం మరియు నటన. మంచి స్నేహితులు మరియు అర్ధం చేస్కునే ఫ్యామిలీ ఉండడం సమంత అదృష్టం.

#6. తను చేసిన సినిమాలు అంతగా ఆడకపోయిన ఇన్ని సంవత్సరాలు చిత్ర పరిశ్రమలో నెట్టుకొచ్చిందంటే చాలా ఓర్పు ఉండాలి.

#7. సమంతకి మొదట్లో తెలుగు వచ్చేది కాదు. ఇప్పుడు కొన్ని సినిమాలకి తనే డబ్బింగ్ చెప్పుతుంది. ఇప్పుడు తెలుగు కూడా బాగా మాట్లాడుతుంది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ పొజిషన్ లో ఉండి ఎన్నో సినిమాలు చేసిన వాళ్ళు కూడా తెలుగు సరిగా మాట్లాడలేరు.

 

#8. అలాగే సమంత చాలామంది చిన్న పిల్లలకు తన వంతుగా సాయం చేస్తుంది. ఓ స్వచ్ఛంద సంస్థకు కూడా రన్ చేస్తుంది సమంత. పై అనేక కారణాలు వలన సమంత ఇతర కథానాయిక కంటే ప్రత్యేకం అని చెప్పవచ్చు.

అందుకే ఎంత మంది హీరోయిన్స్ వచ్చినా సరే సమంతకి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కేవలం సౌత్ ఇండియన్ భాషల్లో మాత్రమే కాకుండా, భారతదేశ వ్యాప్తంగా కూడా సమంత ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.

Article sourced from: Quora/Mounika-Chithaluri


End of Article

You may also like