“సమంత” ఆ పోస్ట్ పెట్టి… మళ్ళీ ఎందుకు డిలీట్ చేసింది..? కారణం ఇదేనా..?

“సమంత” ఆ పోస్ట్ పెట్టి… మళ్ళీ ఎందుకు డిలీట్ చేసింది..? కారణం ఇదేనా..?

by Sunku Sravan

Ads

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ చాలా కొద్ది సమయంలోనే టాప్ హీరోల సరసన నటించి మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

Video Advertisement

సమంత మూవీస్ లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో సమంత రూత్ ప్రభు అనే పేరుతో ఖాతాలను ఓపెన్ చేసింది.

ఎప్పుడు భిన్నమైన పోస్టులు, కొటేషన్స్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే ఆమె తాజాగా “డెడ్ ” అనే పోస్ట్ పెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే మళ్లీ డిలీట్ చేసింది. ఎందుకు చేసిందో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుండి 4వ మూవీ “థోర్ “.. లవ్ మరియు తండర్ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

అయితే ఇది ప్రపంచ వ్యాప్తంగా జూలై 8 వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ను చూసిన సమంతా ఇంస్టాగ్రామ్ లో డెడ్ అని రాసి ఈమోజీలతో సినిమా పోస్టర్ షేర్ చేసింది. డెడ్ అని పెట్టిన కొద్దిసేపటికే వైరల్ అయింది. అయితే ఇది మరికాసేపటికి కనిపించలేదు. మళ్లీ దాని ప్లేస్ లో ఆ సినిమాలోని సూపర్ విలన్ బాలే లుక్ ను షేర్ చేస్తూ ది గాడ్ ఆఫ్ యాక్టింగ్ అని రాసి పోస్ట్ చేసింది.

అయితే ముందుగా సమంత డెడ్ అని ఎందుకు రాసింది, మళ్లీ ఎందుకు డిలీట్ చేసింది అనేది ఎవరికీ తెలియలేదు. అయితే కొంతమంది ఆమెకు సినిమా ట్రైలర్ నచ్చలేదని అందుకే డెడ్ అని రాసిందని, కానీ ఇది వైరల్ అవ్వటంతో, సినిమాపై నెగిటివ్ స్ప్రెడ్ చేసినట్లు అవుతుందని సమంత మళ్లీ డిలీట్ చేసింది అని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా సమంత అప్పుడప్పుడు ఇలాంటి పోస్టులతో అభిమానులకు షాక్ లు ఇస్తూ, వైరల్ గా మారుతుంది.


End of Article

You may also like