ఆ నటిని సీనియర్ ఎన్టీఆర్ ఎందుకు తిట్టాల్సి వచ్చింది..? అసలేం జరిగింది..!

ఆ నటిని సీనియర్ ఎన్టీఆర్ ఎందుకు తిట్టాల్సి వచ్చింది..? అసలేం జరిగింది..!

by Anudeep

Ads

సీనియర్ ఎన్టీఆర్ సహజంగానే ఇండస్ట్రీలో అందరికి గౌరవం ఇచ్చి మాట్లాడేవారు. ఎవరిని అయినా సరే ఆయనకు పేరు పెట్టి సంబోధించడం ఇష్టం ఉండదు. కానీ ఓ సందర్భంలో మాత్రం నటి లక్ష్మిగారి మీద సీనియర్ ఎన్టీఆర్ ఫైర్ అయ్యారు.

Video Advertisement

ఎప్పుడు కూల్ గా ఉండే సీనియర్ ఎన్టీఆర్ నటి లక్ష్మి గారిని ఎందుకు తిట్టాల్సి వచ్చిందో ఇప్పుడు తెల్సుకుందాం. నటి లక్ష్మిగారు, సీనియర్ ఎన్టీఆర్ గారు కలిసి బంగారు మనిషి, ఒకే కుటుంబం సినిమాలలో నటించారు.

sr ntr

ఓరోజు నటి లక్ష్మిగారు సెట్ లోనే టిఫిన్ చేసారు. అయితే.. దోసలో సగం వదిలేసి వెళ్లిపోవడంతో.. అది గమనించిన సీనియర్ ఎన్టీఆర్ “ఏవండీ లక్ష్మి గారు.. అంటూ సీరియస్ గా పిలిచారు. ఏమి తిన్న అరిగించుకోగల వయసులో ఉన్న మీరు ఇలా సగం దోసనే తింటారా..? సిగ్గులేదా… అంటూ సీరియస్ అయ్యారు. దీనితో లక్ష్మి గారు మర్యాదగా పిలిచి తిడుతున్నారు అని ఎన్టీఆర్ తో అన్నారు. ఆ తరువాత ఎన్టీఆర్ గారు మీరు ఇంకా చిన్నపిల్లే అని.. బాగా తినాలని, వ్యాయామం చేసి ఆరోగ్యం గా ఉండాలి హితవు చెప్పారు.


End of Article

You may also like