బోనీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బోని కపూర్ అందరికీ సుపరిచితమే. ప్రముఖ నిర్మాతగా, దర్శకుడిగా మంచి గుర్తింపు పొందాడు. అలాగే ఎన్నో విజయవంతమైన సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. బాలీవుడ్ లో అతిపెద్ద నిర్మాతల్లో బోనీకపూర్ ఒకరు. అయితే ఎప్పుడూ కూడా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏదో ఒక వార్త వస్తూనే ఉండేది. మొదటిసారి బోనీ కపూర్ శ్రీదేవిని సినిమాల్లో చూశాడు. వెంటనే శ్రీదేవి తాను నిర్మించే సినిమాల్లో నటించాలని అనుకున్నాడు బోనీ కపూర్.

Video Advertisement

ఆ తర్వాత శ్రీదేవి తల్లిని కలుసుకుని మిస్టర్ ఇండియా సినిమా ఆఫర్ చేశాడు. ఈ సినిమా చేయడానికి శ్రీదేవి తల్లి బోనీకపూర్ ని రూ.10 లక్షలు అడిగింది. అయితే ఆమెకి రూ.11 లక్షలను ఇచ్చి ఆశ్చర్యపరిచాడు బోనీకపూర్. ఆ తర్వాత శ్రీదేవి బోని కపూర్ దర్శకత్వంలో హమ్ పాంచ్ సినిమాలో నటించింది.

హం పాంచ్ సినిమా సమయంలో మిథున్ చక్రవర్తి సలహామేరకు బోని కపూర్ కి రాఖీ కట్టింది శ్రీదేవి. ఆ సినిమా సమయంలో వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కింద మారారు. ఆ తర్వాత మెల్లగా శ్రీదేవి, మిధున్ మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. 1985లో మిధున్ ని శ్రీదేవి వివాహం చేసుకుంది. వీరు 1988లో విడాకులు తీసుకున్నారు.

మిథున్ తో కలిసి ఆమె రిలేషన్ షిప్ లో ఉన్న సమయంలోనే శ్రీదేవి బోని కపూర్ మధ్య పుకార్లు వచ్చేవి. దీని కారణంగానే బోని కపూర్ కి రాఖీ కట్టమన్నాడు మిథున్. అయితే శ్రీదేవి రాఖీ కట్టేటప్పటికి బోనీ కపూర్ కి శ్రీదేవి అంటే చాలా ఇష్టం. ఎక్కువ సమయం శ్రీదేవితో బోనీ కపూర్ గడుపుతున్నాడని బోని కపూర్ భార్య కి తెలిసింది. ఆఖరికి బోనీ కపూర్ శ్రీదేవితో తనకి సంబంధం ఉందని ఒప్పుకున్నాడు. ఇద్దరు పిల్లలు అప్పటికే బోనీ కపూర్ కి ఉన్నారు. అయినప్పటికీ మొదటి భార్యకు విడాకులు ఇచ్చి శ్రీదేవిని వివాహం చేసుకున్నాడు బోనీకపూర్.