Ads
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుప్ఫ’ పాన్ ఇండియా చిత్రం తో స్టార్ డైరెక్టర్ సుకుమార్ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి కొనసాగింపుగా ‘పుష్ప ది రూల్’ని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం యావత్ దేశ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Video Advertisement
అలాగే ‘ది కశ్మీర్ ఫైల్స్’తో సంచలనం సృష్టించిన దర్శక నిర్మాతలు వివేక్ రంజన్ అగ్రహోత్రి కూడా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. అలాంటి వీరిరువురు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారా.. అంటే.. అవుననే అనిపిస్తోంది. తాజాగా వివేక్ రంజన్ అగ్రహోత్రి, అభిషేక్ అగర్వాల్ దర్శకుడు సుకుమార్ ని కలిసినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు కలిసి సరికొత్త సినిమాకు రూపకల్పణ చేయబోతుండటం సరికొత్త చర్చకు తెరలేపుతోంది.
ఈ మేరకు ఈ అరుదైన కలయికకు సంబంధించిన ఆసక్తికరమైన ఫొటో తో పాటు దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేశారు. సినిమాతో భారతదేశాన్ని ఏకం చేయడం. వివరాలు త్వరలో.. ఊహించండి?.. సుకుమార్ (పుష్ప దర్శకుడు) + అభిశేక్ అగర్వాల్ (నిర్మాత ది కశ్మీర్ ఫైల్స్) + యువర్స్ ట్రూలీ’ అంటూ సుకుమార్ అభిషేక్ అగర్వాల్ తో కలిసి వున్న ఫొటోలని షేర్ చేశాడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి.
అయితే ఈ ప్రాజెక్ట్ ఏంటీ? ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు? అనే విషయాల్ని మాత్రం ఎక్కడా వెల్లడించకపోవడం గమనార్హం. సుకుమార్ సమర్పకుడిగా వ్యవహరిస్తారా? లేక డైరెక్టర్ గా వుంటారా? అన్నది తెలియాల్సి వుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.
End of Article