Ads
సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్తతో దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులంతా కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్, నటశేఖర కృష్ణ అంటే ఓ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన తెలుగు సినిమాకు ఓ ఎమోషన్. ధైర్యానికి కేరాఫ్ అడ్రెస్.
Video Advertisement
అయితే కృష్ణ అంత్యక్రియల విషయం లో ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్టార్ అంత్యక్రియలు మహాప్రస్థానం లో జరిగిన విషయం తెలిసిందే. ఎందుకు ఘట్టమనేని కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది అభిమానులు చర్చించుకుంటున్నారు.
సాధారణంగా సెలబ్రిటీలు, అగ్రనటుల అంత్యక్రియలను వారి వారి సొంత ప్రాంతాల్లో, సొంత స్థలాల్లో చేస్తారు. ఆ తర్వాత వారికి స్మారకం ఏర్పాటు చేస్తారన్న విషయం తెలిసిందే. నిజానికి కృష్ణకు, మహేష్‌బాబుకి నగరం లో చాలా స్థలాలు ఉన్నాయి. పద్మాలయ స్టూడియో ప్రాంతం లో కూడా కొన్ని స్థలాలు ఉన్నాయి. మొత్తం అభిమానగణాన్ని, దేశ సినీ పరిశ్రమను శోకంలో ముంచి వెళ్లిపోయిన కృష్ణకు ప్రత్యేకంగా సొంత స్థలం లో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించిన స్మారకం ఏర్పాటు చేస్తే బాగుండేది అంటున్నారు.
గతంలో చాలామంది అగ్ర నటులకు వాళ్ల కుటుంబసభ్యులు సొంత ప్రాంతాల్లో అంత్యక్రియలు నిర్వహించి స్మారకాలను ఏర్పాటు చేసిన విషయాలను కృష్ణ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. అంత్యక్రియల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య ఏం చర్చ జరిగింది, ఎవరేమన్నారు, దానికి ఎవరు ఏం చెప్పారు అనే విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై మహేష్ కుటుంబం ఏమన్నా వివరణ లాంటిది ఇచ్చి చర్చను ఆపేస్తుందేమో చూడాలి.
End of Article