• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

“తెలుగు సినిమా” ని ఎలా మర్చిపోతున్నారు..? ప్రతిసారి ఇలాగే ఎందుకు జరుగుతోంది..?

Published on July 23, 2022 by Mohana Priya

భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత ఎక్కువ సినిమాలు విడుదల అయ్యే పరిశ్రమ తెలుగు సినీ పరిశ్రమ. ఒక సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది కొత్తవాళ్ళు పరిచయమవుతుంటారు. అలా పరిచయం అయిన వారిలో చాలామంది నటీనటులు ఉంటే, ఇంకొంతమంది సినిమా టెక్నీషియన్స్ కూడా ఉంటారు.

వారందరిలో చాలామంది గుర్తుండిపోయే పర్ఫామెన్స్ ఇస్తారు. వారందరూ చేసిన పనికి గుర్తింపులాగా అవార్డ్స్ ఇచ్చి సత్కరిస్తారు. అలా ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా అవార్డ్స్ ఇచ్చారు. అయితే అన్నిటికంటే గౌరవంగా భావించేది మాత్రం నేషనల్ అవార్డ్. నేషనల్ అవార్డ్ వస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కినందుకు చాలా గౌరవంగా భావిస్తారు.

నేషనల్ అవార్డ్ అంటే కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాకుండా ఇతర సినిమా ఇండస్ట్రీలు కూడా పరిగణలోకి తీసుకుంటారు. జాతీయ స్థాయిలో విడుదలైన సినిమాల్లో ఏది గొప్ప సినిమా అయితే, ఆ సినిమాలో ఏది బాగుంటే దానికి అవార్డ్ ఇస్తారు. ప్రతి సంవత్సరం ఈ అవార్డ్ లను ఇస్తారు. ఈ సారి కూడా అలానే జాతీయ అవార్డ్ లని ప్రకటించారు. అందులో సురారై పోట్రు సినిమాకి ఉత్తమ నటుడిగా సూర్య పురస్కారం అందుకున్నారు. ఈ సినిమాని తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో విడుదల చేశారు. ఇదే సినిమాలో హీరోయిన్ గా నటించిన అపర్ణ బాలమురళికి ఉత్తమ నటి అవార్డ్ వచ్చింది.

aakasam nee haddu raa 5

ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డ్ సుధా కొంగరకి వచ్చింది. ఈ సినిమాకి మొత్తంగా 5 అవార్డ్స్ వచ్చాయి. అయితే తెలుగు సినిమాలు అయిన కలర్ ఫోటోకి, నాట్యంకి కూడా పలు విభాగాల్లో అవార్డ్స్ వచ్చాయి.  అలవైకుంఠపురంలో సినిమాకి తమన్ కి ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డ్ వచ్చింది. అయితే ఏదైనా సరే తెలుగు సినీ పరిశ్రమకి మిగిలిన సినిమా పరిశ్రమలకు దక్కినంత గుర్తింపు దక్కట్లేదు ఏమో అన్న సందేహాలు నెలకొంటున్నాయి. తెలుగులో కూడా చాలా ప్రయోగాత్మక సినిమాలు విడుదలవుతున్నాయి. 2019లో చూస్తే బ్రోచేవారెవరురా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలు విడుదల అయ్యాయి. అలాగే మల్లేశం సినిమా కూడా విడుదల అయ్యింది.

కానీ వీటిలో ఏ ఒక్క సినిమాకు కూడా అవార్డ్ రాలేదు. 2019లో వచ్చిన సినిమాల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న సినిమా జెర్సీ. ఈ సినిమాలో నాని నటనని ఎంతో మంది ప్రముఖులు ప్రశంసించారు. కానీ నానికి జాతీయ స్థాయిలో అవార్డ్ మాత్రం దక్కలేదు. ఆ సంవత్సరం నేషనల్ అవార్డ్ నానికి వస్తుంది అని అనుకున్నారు. కానీ వేరే విభాగాల్లో జెర్సీకి అవార్డ్స్ వచ్చాయి. అలాగే శ్రీదేవి చివరిగా నటించిన మామ్ సినిమాకి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. శ్రీదేవి లేకపోవడంతో శ్రీదేవి కుటుంబ సభ్యులు వచ్చి ఆ అవార్డ్ తీసుకున్నారు.

ఆ సంవత్సరం ఎన్నో మంచి సినిమాలు వచ్చినా, ఎంతోమంది నటులు బాగా నటించినా కూడా శ్రీదేవి చివరి సినిమా కాబట్టి ఆమె అంత మంచి నటి కాబట్టి ఆమెకి జాతీయ స్థాయిలో సత్కారం లభించడం సరైన నిర్ణయం అని అనుకోని ఆ సంవత్సరం అవార్డ్ ఇచ్చారు. అలాగే జాతీయ స్థాయిలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా ఈ సంవత్సరం అవార్డ్ వస్తుందేమో అని అనుకున్నారు. డిస్కో రాజా సినిమాలో ఎస్పీ బాలు గారు పాడిన పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆ పాట పాత సినిమా మెలోడీని గుర్తు తెచ్చేలాగా ఉంది.

why telugu cinema is not getting recognized

అంత మంచి పాటని గుర్తించకపోవడం ఏంటి? అని అంటున్నారు. ఎస్పీ బాలు గారికి అంతకుముందు జాతీయ అవార్డ్ లు వచ్చినా కూడా ఇది చివరిగా పాడిన పాట కాబట్టి గుర్తింపు లభిస్తే బాగుండేది అని అంటున్నారు. అలాగే పలాస సినిమాలో కూడా చివరిగా బాలు గారు పాట పాడారు. కానీ ఇవి పక్కన పెడితే చాలా సంవత్సరాల నుండి ఈ విషయం అయితే ఉంది. ఏదైనా సరే మిగిలిన పరిశ్రమలతో పోలిస్తే తెలుగు పరిశ్రమలో వచ్చే సినిమాలకి గుర్తింపు తక్కువ అని అంటారు. తెలుగులో కమర్షియల్ సినిమాలు విడుదలవుతాయి. అంతేకాకుండా ప్రయోగాత్మక సినిమాలు, చరిత్రలో నిలిచిపోయే సినిమాలు కూడా విడుదలవుతాయి. ఇది మాత్రమే కాకుండా అంతకుముందు రంగస్థలం విషయంలో కూడా ఇలాగే జరిగింది.

why telugu cinema is not getting recognized

బాహుబలి విషయంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. ఈ రెండు సినిమాల్లో హీరోలుగా నటించిన రామ్ చరణ్, ప్రభాస్ లకి ఉత్తమ నటుల అవార్డ్ వస్తుందేమో అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అలాంటిది ఇవే సినిమాలు వేరే ఇండస్ట్రీలో చేస్తే జాతీయ స్థాయి గుర్తింపు లభించేది ఏమో అనే కామెంట్స్ కూడా వచ్చాయి. మహానటి సినిమాకి కీర్తి సురేష్ కి అవార్డ్ వచ్చింది. కానీ ఉత్తమ హీరో అవార్డ్ మాత్రం తెలుగు ఇండస్ట్రీలో రావడం తక్కువ. కానీ ఏమైనా ఈసారి కలర్ ఫోటో, నాట్యం, అల వైకుంఠపురంలో గత సంవత్సరం అనౌన్స్ చేసిన 2019 లో వచ్చిన జెర్సీ లాంటి మంచి సినిమాలకి గుర్తింపు దక్కింది అని, వచ్చే సంవత్సరం ఉత్తమ నటులు అవార్డ్ కూడా తెలుగు సినిమాల్లో నటించిన వారికి వస్తే బాగుండు అని అంటున్నారు.


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • “ఆ ఒక్క సినిమా… 25 సినిమాలతో సమానం..!” అంటూ… మహేష్ బాబు కామెంట్స్..!
  • SSMB28 గురించి… ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చిన మహేష్ బాబు..!
  • ప్రస్తుతం ఉన్న సమస్యల మధ్య… ఈ “క్యారెక్టర్ ఆర్టిస్ట్” లని ఆపగలరా..?
  • మీరు అర్ధరాత్రి ట్రైన్ ఎక్కాల్సి ఉంటె.. ఆ టైం లో ట్రైన్ డోర్ లోపలి వైపు నుంచి లాక్ చేసుకుని ఉంటె ఏమి చేయాలి..?
  • సీరియల్ నటుల క్యూట్ రియల్ స్టోరీ! ఎప్పుడు గొడవ పడుతూనే ఉండే వీరు లైవ్ లో ప్రపోజ్ చెయ్యడంతో..!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions