అసలు రేణు దేశాయ్ ఏం చేశారు..? ఎందుకు ఆమె విషయంలో ఇలా జరుగుతోంది..?

అసలు రేణు దేశాయ్ ఏం చేశారు..? ఎందుకు ఆమె విషయంలో ఇలా జరుగుతోంది..?

by Harika

Ads

సెలబ్రిటీలు అన్న తర్వాత వారి జీవితంలో వ్యక్తిగతమైన విషయాలు కూడా అందరికీ తెలిసిపోయి ఉంటాయి. అందులో ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారి జీవితం అయితే చాలా మందికి తెలిసి ఉంటుంది. వీళ్ళు ఒకవేళ సోషల్ మీడియాలో ఉంటే, వాళ్లని వాళ్ల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు. కొంత కాలం తర్వాత ఇవన్నీ ఆగిపోతాయి. కానీ రేణు దేశాయ్ విషయంలో మాత్రం ఇలా జరగలేదు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ పెళ్లి చేసుకొని, కొన్నాళ్ళకి విడిపోయారు. కానీ పిల్లల విషయం వచ్చేవరకు ఇద్దరు తమ బాధ్యతలు తాము నిర్వర్తిస్తూ ఉంటారు. అకిరా, ఆద్య జీవితాల్లో ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటూ ఉంటారు. పిల్లల బాగోగులు రేణు దేశాయ్ చూసుకుంటూ ఉంటారు.

Video Advertisement

ఇటీవల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అకిరా, ఆద్య కూడా వెళ్లారు. వారందరి మధ్య ఆరోగ్యకరమైన స్నేహం ఉంది. కానీ ప్రజలు మాత్రం అది అర్థం చేసుకోవట్లేదు. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే, పవన్ కళ్యాణ్ గురించి ఏదో ఒక ప్రశ్న అడుగుతూనే ఉంటారు. గతంలో రేణు దేశాయ్ ఈ విషయం మీద చాలా సార్లు వివరించారు. ఇది అయిపోయిన విషయం అని చెప్పారు. అయినా కూడా వినకుండా, “పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తిని ఎందుకు వదిలేశారు? చాలా తొందరపడ్డారు” అంటూ ఇటీవల రేణు దేశాయ్ చేసిన ఒక పోస్ట్ కి కామెంట్ చేశారు. అందుకు రేణు దేశాయ్ కూడా స్పందించి తాను వదిలేయలేదు అని చెప్పారు.

నిన్న కూడా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని కామెంట్స్ కి ఆద్య బాధపడింది అని ఒక పోస్ట్ చేశారు. అందులో రేణు దేశాయ్ ఎన్ని కామెంట్స్ ఎదుర్కొంటున్నారో తెలుస్తోంది. ఇన్ని సార్లు రేణు దేశాయ్ ఈ విషయం మీద వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఆమె మీద ఏదో ఒక రకంగా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. తన పని తాను చేస్తూ, తన కుటుంబ బాధ్యతలు తాను చూసుకుంటూ ఉన్న ఒక మహిళ మీద ఇలాంటి కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి? అసలు రేణు దేశాయ్ ఏం చేశారు? “ఇక్కడ రేణు దేశాయ్ చేసింది ఏం లేదు. ఆమె తన పని తాను చేసుకుంటున్నారు అంతే.”

“అసలు ఆమెకి అందరూ అడిగే ప్రశ్నలకు వివరణ ఇవ్వాల్సిన సమయం కూడా ఉండదు. అయినా కూడా తనని ఒకరు అడిగారు అని వారికి జవాబు చెప్పడం తన బాధ్యత అనే ఉద్దేశంతోనే రేణు దేశాయ్ అందరికీ జవాబు ఇస్తూ ఉంటారు. కానీ రేణు దేశాయ్ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా ఇంకా ఆమెని ప్రశ్నలు అడిగి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు” అంటూ సోషల్ మీడియాలో రేణు దేశాయ్ కి మద్దతుగా అందరూ కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like