ఎంతో మంది ప్రొడ్యూసర్స్ ఉన్నప్పటికీ డి రామా నాయుడు లెవెల్ వేరు. కేవలం మన తెలుగు భాష లోనే కాకుండా ఇండియా లో ఉన్న అన్ని భాషల్లో కూడా రామ నాయుడు సినిమాలు తీశారు. పైగా ఆయన నిర్మించిన సినిమాల్లో దాదాపు అన్ని సినిమాల్లో కూడా సక్సెస్ ని అందుకున్నాయి.

Video Advertisement

ఎప్పుడూ కూడా రామా నాయుడుగారు హీరోలని, హీరోలు యొక్క శక్తిని నమ్ముకుని సినిమాలు తీయలేదు. ఎప్పుడు కూడా కేవలం ఆయన కంటెంట్ ని నమ్ముకుని మాత్రమే సినిమాలకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించే వారు.

ఇది ఇలా ఉంటే డి. రామ నాయుడు కి ఈ ఇద్దరి హీరోలు అంటే ఎంతో ప్రత్యేకం. మరి వారు ఎవరు..?, ఎందుకు ప్రత్యేకం అనేది చూస్తే.. రామా నాయుడు కి మాత్రం సీనియర్ ఎన్టీఆర్ మరియు పవన్ కళ్యాణ్ చాలా ప్రత్యేకం. రామా నాయుడు తీసిన మొట్ట మొదటి సినిమా కి హీరో ఎన్టీ రామారావు గారు. అందుకనే ఎన్టీ రామారావు గారు అంటే రామ నాయుడు గారికి ప్రత్యేకం.

అలానే రామా నాయుడు ఆఖరిగా తీసిన చిత్రం గోపాల గోపాల. ఈ సినిమా లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు విక్టరీ వెంకటేష్ హీరోలుగా నటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఆఖరి సినిమా అవ్వడం వలన పవన్ కళ్యాణ్ అంటే కూడా స్పెషల్. అందుకని ఈ ఇద్దరి నటులు కూడా రామా నాయుడికి ప్రత్యేకమని చెప్పవచ్చు.

ఇది ఇలా ఉంటే ఎప్పుడూ కూడా హీరోలను చూసుకుని సినిమా తీసే వారు కాదు రామానాయుడు. కేవలం సినిమా కథ చూసుకుని మాత్రమే ప్రొడ్యూసర్ గా వ్యవహరించే వారు. ఏది ఏమైనా రామా నాయుడు మరణం మనకి తీరని లోటు అని చెప్పాలి.