కేవలం RRR విషయంలో మాత్రమే ఇవన్నీ ఎందుకు గుర్తొచ్చాయి..? ముందు ఏమైంది..?

కేవలం RRR విషయంలో మాత్రమే ఇవన్నీ ఎందుకు గుర్తొచ్చాయి..? ముందు ఏమైంది..?

by Mohana Priya

ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న ఒకే ఒక్క టాపిక్ ఆస్కార్. రాజమౌళి లాంటి ఎంతో ప్రతిభ ఉన్న దర్శకుడు రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాని ఆస్కార్ కి పంపలేదు. ఈ విషయంపై చాలా కామెంట్స్ వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అయితే ఆస్కార్ అంటేనే మండిపడుతున్నారు.

Video Advertisement

ఇంత మంచి సినిమాని వదిలేసి అదేదో సినిమా అని ఆస్కార్ కి పంపారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మాత్రమే కాదు ఎంతోమంది ఈ విషయంపై పెద్ద ఎత్తున ఆర్ఆర్ఆర్ సినిమాకి మద్దతు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.

how much producers spend to nominate RRR for oscar nominations

బాలీవుడ్ కి చెందిన ఎంతో మంది ప్రముఖులు కూడా ఈ సినిమా ఆస్కార్ కి వెళ్లాల్సింది అని అంటున్నారు. చాలా సోషల్ మీడియా పేజెస్ అయితే ఏదో రాజకీయం జరిగింది అని, ఎప్పుడు సౌత్ సినిమాని ఇలానే తొక్కేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలా అవ్వడం కొత్త ఏమీ కాదు. అంతకుముందు సూర్య నటించిన రెండు సినిమాల విషయంలో ఇలాగే జరిగింది. సూర్య హీరోగా నటించిన ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాలు కూడా ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్లి అక్కడ వెనక్కి వచ్చేసాయి. ఒకసారి మూడు సినిమాలని పోల్చి చూస్తే, ఆర్ఆర్ఆర్ గ్రాఫిక్స్ పరంగా హైలైట్ అయిన సినిమా.

సినిమాలో ఎలివేషన్స్ బాగుంటాయి. అంత పెద్ద హీరోలు ఇద్దరూ కలిసి నటించడం అనేది చాలా మంచి విషయం. ఆ హీరోల పాత్రలు కూడా చాలా బాగా రూపొందించారు. స్వాతంత్రం వచ్చిన సమయానికి సంబంధించిన సినిమా ఇది. చరిత్రలో ఎంతో గుర్తింపు పొందిన ఇద్దరు వ్యక్తుల గురించి, ఒకవేళ వారిద్దరూ కలుసుకుంటే ఎలా ఉంటుందో అనే ఒక కథపై ఈ సినిమా రూపొందించారు. కానీ కంటెంట్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ సినిమాలో కథ అంత పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదేమో అని అనిపిస్తుంది. ఆస్కార్ కి వెళ్ళాలి అంటే వీటన్నిటితో పాటు బలమైన కథ ఉండడం కూడా చాలా ముఖ్యమైన విషయం.

సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాలు ఈ విషయంలో ముందు వరసలో ఉన్నాయేమో అనిపిస్తుంది. ఆకాశమే నీ హద్దురా కూడా నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించిన సినిమా. కానీ ఈ సినిమా ఎంతోమంది ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. చాలా స్ఫూర్తినిచ్చే కథతో ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా చూశాక నిజంగానే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకం కలిగేలాగా ఈ సినిమా కథని రాసుకున్నారు. మరొక సినిమా జై భీమ్ విషయానికి వస్తే ఆలోచించే అంశం ఉన్న సినిమా ఇది.

jai bhim review

సమాజంలో జరిగే చాలా విషయాలు, ఇప్పటికి కూడా జరుగుతున్న విషయాలపై ఈ సినిమా రూపొందించారు. ఇది కూడా నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందించిన సినిమా. కానీ సమాజంలో జరిగిన ఒక సంఘటనపై ఈ సినిమా తీశారు. సినిమాలో ఎంచుకున్న పాయింట్ కానీ, చూపించిన విధానం కానీ ప్రేక్షకులని ఆలోచింపచేసేలాగా ఉంది. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ సినిమాలో కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉన్నాయి. అసలు ఒక కమర్షియల్ సినిమా ఆస్కార్ కి వెళ్ళాలి అనుకోవడం కూడా పొరపాటే అవుతుందేమో.

Why this is happening with only rrr movie

అంతకుముందు బాలీవుడ్ నుండి గల్లీ బాయ్ సినిమాని ఆస్కార్ నామినేషన్ కి పంపించారు. ఆ సినిమా చూసుకుంటే అది కమర్షియల్ సినిమా కాదు. ముంబైలోని స్లమ్ ఏరియాలో తిరిగే ఒక యువకుడు ర్యాపర్ ఎలా అవుతాడు అనే అంశాన్ని చూపించారు. వాళ్లు ఆర్థికంగా ఎదుర్కొనే సమస్యలు ఏవి? అలాగే సమాజంలో వారిని ఎలా చూస్తారు? అనే అంశాలను కూడా ఈ సినిమాలో చూపించారు. ఆకాశమే నీ హద్దురా, అలాగే జై భీమ్ సినిమాలు కూడా కమర్షియల్ సినిమాలు కావు. చాలా బలమైన కంటెంట్ ఉన్న సినిమాలు.

rrr trailer analysis and hidden details

కానీ ఈ సినిమాలు ఆస్కార్ కి వెళ్ళనప్పుడు ఇంత పెద్ద చర్చ జరగలేదు. ఇప్పుడు మాత్రం ఆర్ఆర్ఆర్ వెళ్లకపోతే గొడవలు అవుతున్నాయి. ట్రోలింగ్ జరుగుతోంది. “మా సినిమాలు అంటే మీకు చిన్న చూపు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో చాలా మంది, “అంత బలమైన కంటెంట్ ఉన్న సినిమాలు ఆస్కార్ కి వెళ్ళనప్పుడు ఏం మాట్లాడలేదు కానీ, ఒక కమర్షియల్ అంశాలు ఉన్న సినిమా వెళ్ళనప్పుడు మాత్రం ఇంత రియాక్ట్ అవ్వల్సిన అవసరం ఏంటి?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


You may also like