“గుంటూరు కారం” విషయంలో త్రివిక్రమ్ ని బానే తిడుతున్నారు..కానీ ఇది ఆలోచించారా.?

“గుంటూరు కారం” విషయంలో త్రివిక్రమ్ ని బానే తిడుతున్నారు..కానీ ఇది ఆలోచించారా.?

by Harika

Ads

ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు వస్తూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్క్ ఉంటుంది. కొంత మంది దర్శకుల సినిమాలు మాత్రం ప్రేక్షకులకి చాలా దగ్గర అవుతాయి. బాక్స్ ఆఫీస్ టాక్ తో సంబంధం లేకుండా ఆ దర్శకుడి సినిమాకి ఫ్యాన్ బేస్ ఉంటుంది.

Video Advertisement

అలా తన సినిమాలతో మ్యాజిక్ చేసి ప్రేక్షకులకు దగ్గర అయ్యారు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే ఇవాళ గుంటూరు కారం సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా స్టోరీ రొటీన్ గా ఉంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

మహేష్ బాబులాంటి స్టార్ హీరోకి పడాల్సిన సినిమా ఇది కాదు అని అంటున్నారు. అయితే ఒక విషయం మాత్రం మర్చిపోతున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ ని తిడుతున్నారు. అంతకుముందు రిలీజ్ అయిన అజ్ఞాతవాసి సినిమాకి కూడా త్రివిక్రమ్ ని తిట్టారు. దానికి ముందు వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాకి కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది. దానికి కూడా అలాగే అన్నారు. కానీ జులాయి తర్వాత త్రివిక్రమ్ ఒక్క కొత్త స్టోరీ కూడా రాయలేదు.

pawan-kalyan-trivikram

ఒక పెద్ద ఇల్లు, ఆ ఇంట్లో కొంత మంది మనుషులు, ఒక తల్లి, ఒక తండ్రి, వారిలో ఎవరో ఒకరి ప్రేమకి దూరమైన హీరో, ఇద్దరు హీరోయిన్లు, వాళ్లకి తెలివి ఉండదు, కొంత మంది బంధువులు, చివరికి వాళ్ళందరూ ఒకరిని ఒకరు ఎలా అర్థం చేసుకున్నారు. త్రివిక్రమ్ సినిమాలు అన్నీ ఇదే కాన్సెప్ట్ మీద నడుస్తాయి. అత్తారింటికి దారేది తో మొదలైన ఈ కాన్సెప్ట్, ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది.

అత్తారింటికి దారేదిలో అత్త సెంటిమెంట్, సన్నాఫ్ సత్యమూర్తిలో నాన్న సెంటిమెంట్, అజ్ఞాతవాసిలో తల్లి సెంటిమెంట్, మళ్లీ అరవింద సమేత సినిమాలో మళ్లీ నాన్న సెంటిమెంట్, మళ్లీ అల వైకుంఠపురంలో సినిమాలో తల్లి సెంటిమెంట్, ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో మళ్లీ తల్లి సెంటిమెంట్. హీరో వాళ్ళ ప్రేమకి దూరం అవ్వడం, లేదా వాళ్లకి దగ్గర అవ్వాలి అని ప్రయత్నించడం. హిట్ అయితే మాత్రం హీరోని అంటున్నారు. ఫ్లాప్ అయితే మాత్రం త్రివిక్రమ్ ని తిడుతున్నారు.

Ala Vaikunthapurramuloo Dialogues

కానీ హిట్ అయినా, ఫ్లాప్ అయినా త్రివిక్రమ్ మాత్రం ఒకటే కథ సినిమా తీస్తున్నారు. కాబట్టి సినిమా రిజల్ట్ మారితే త్రివిక్రమ్ ని తిట్టడం అనేది ఎంత వరకు కరెక్ట్. హీరోల పెర్ఫార్మెన్స్ ని బట్టి టాక్ కూడా మారుతుంది. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాకి అల్లు అర్జున్, ఆ తర్వాత అరవింద సమేతకి జూనియర్ ఎన్టీఆర్, అలవైకుంఠపురంలో సినిమాకి అల్లు అర్జున్, ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి మహేష్ బాబు. వీళ్ళందరూ కూడా సినిమాకి ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నారు. వాళ్ల శక్తికి మించి కష్టపడుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా కోసం తన ఫిజిక్ మార్చుకున్నారు. అల వైకుంఠపురంలో సినిమా కోసం అల్లు అర్జున్ ఇతర హీరోల పాటలకి డాన్స్ చేయడం, ఇంకా కొంచెం స్టైలిష్ గా రెడీ అవ్వడం వంటివి చేశారు. ఇప్పుడు మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కోసం బాగా కష్టపడ్డారు అని ప్రతి వాళ్లు అంటున్నారు. కొన్ని సినిమాలకి దేవి శ్రీ ప్రసాద్, తమన్ కూడా కష్టపడ్డారు. అజ్ఞాతవాసి సినిమా విషయం వస్తే, పవన్ కళ్యాణ్ నటన కొత్తగా ఉన్నా కూడా కొన్ని సీన్స్ చిత్రీకరించిన విధానం, అందులో పవన్ కళ్యాణ్ నటించిన విధానం కాస్త రొటీన్ కి భిన్నంగా ఉండడంతో సినిమా రిజల్ట్ అలా అయ్యింది.

did you observe this scene in aravinda sametha veera raghava

కాబట్టి ఇందులో త్రివిక్రమ్ ని తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. త్రివిక్రమ్ ఎప్పటిలాగానే అదే కథతో మళ్ళీ సినిమా తీశారు. కానీ ఈ సారి తమన్ కూడా పాటలు సరిగ్గా ఇవ్వలేకపోయేసరికి సినిమా టాక్ ఇలా వచ్చింది అంతే. కానీ త్రివిక్రమ్ సినిమాలకి మిక్స్డ్ టాక్ కొత్త ఏమీ కాదు. ప్రతి సినిమా టాక్ ఇలాగే ఉంటుంది. ఆయన ఎప్పుడూ కొత్త కథ ఏమీ రాయలేదు. ఇదే కథని మార్చి మార్చి తీస్తున్నారు. అందుకే ప్రతి సినిమా టాక్ ఇలాగే మొదలవుతుంది. ప్రతి సినిమాకి త్రివిక్రమ్ ఇదే రకంగా పనిచేస్తారు.


End of Article

You may also like