ఎవరైనా ఒక వ్యక్తి తాను ఎంచుకున్న రంగంలో గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే చాలా కష్టాలు పడటంతో, పాటు ఎన్నో ఇబ్బందికర సంఘటనలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులోనూ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో నెగ్గడం అంటే కష్టంతో పాటు అదృష్టం కూడా ఉండాలి.

Video Advertisement

అయితే ఎంత కష్టపడి పైకి వచ్చినా కూడా వారిపై నెగటివ్ కామెంట్స్ చేసే వ్యక్తులు ఉంటూనే ఉంటారు. ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఎంతో మంది టాప్ హీరోలు ఉన్నారు. ఎంతో మంది యంగ్ హీరోలు కూడా ఉన్నారు. ప్రతి హీరో తమకి వచ్చిన ప్రతి సినిమాని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ, అవకాశాన్ని వారు తాము ముందుకు వెళ్లడానికి ఒక మెట్టుగా అనుకొని ఎంతో కష్టపడతారు.

funny video editing on thalapathy vijay..

కానీ ఎంత కష్టపడినా కూడా వీరిని ఇష్టపడని వాళ్ళు ఎక్కడో ఒకచోట ఉంటూనే ఉంటారు. సాధారణంగా ఆ వ్యక్తి మరొక వ్యక్తితో ఈ మాట అంటే మిగిలిన వారు ఎవరికి తెలియదు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఒకరికి ఏదైనా అనిపిస్తే, ఆ విషయాన్ని వాళ్లు షేర్ చేస్తే, ఒకవేళ అది పాజిటివ్ కామెంట్ అయితే అందరూ బాగానే రిసీవ్ చేసుకుంటారు. కానీ ఒకవేళ అది నెగిటివ్ కామెంట్ అయితే మాత్రం, అది కూడా ఏదైనా ఒక హీరోకి సంబంధించింది అయితే మాత్రం ఆ కామెంట్ చాలా వైరల్ అవుతుంది.

funny video editing on thalapathy vijay..

అలా కామెంట్ చేసిన వ్యక్తి గురించి ఏమీ తెలియకుండానే అతనిని చాలా రకాలుగా తిడుతూ ఉంటారు. అయితే కొంత మంది హీరోలపై మాత్రం ట్రోలింగ్ ఇప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఇందాక చెప్పిన విధంగానే ఒక వ్యక్తి ఒక నటుడిగా ఎదగడం, అందులోనూ ఒక పెద్ద స్టార్ గా ఎదగడం అనేది మామూలు విషయం కాదు. అలా ఎదిగే క్రమంలో ఆ వ్యక్తి ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొంటాడు.

dhoni producing fims with south stars like mahesh and vijay..!!

అలా చిన్న వయసులోనే కెరీర్ మొదలుపెట్టినా కూడా, ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొని, తనని తాను మెరుగుపరుచుకుంటూ పెద్ద స్టార్ హీరో అయ్యారు విజయ్. విజయ్ తమిళ్ హీరో అయినా కూడా తుపాకీ సినిమా తర్వాత నుండి తెలుగులో చాలా ఫేమస్ అయ్యారు. ఒక సమయంలో విజయ్ ఎక్కువగా తెలుగు రీమేక్ సినిమాలు చేశారు. అందులోనూ ముఖ్యంగా మహేష్ బాబుని తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పెద్ద హీరోగా నిలబెట్టిన సినిమాల్లో ముఖ్యమైన ఒక్కడు, పోకిరి సినిమాలని తమిళ్ లో విజయ్ రీమేక్ చేశారు.

ఇది మాత్రమే కాకుండా ఇంకా చాలా సినిమాలు అందులోనూ నువ్వు నాకు నచ్చావ్, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి తమిళ్ సినిమాలో కూడా విజయ్ నటించారు. అంతే కాకుండా విజయ్ హీరోగా నటించిన ఎన్నో సినిమాలు కూడా తెలుగులో రీమేక్ అయ్యాయి. అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ అనేవి నడుస్తూనే ఉంటాయి. అంతకుముందు తమిళ్ ఇండస్ట్రీలో ఒక హీరో గురించి కామెంట్ చేస్తే, ఆ వ్యక్తి తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న మరొక హీరో గురించి కామెంట్ చేయడం వంటివి జరుగుతూ ఉండేవి.

vijay 2

తెలుగులో కూడా ఇలాంటివి చాలా అయ్యాయి. ఇప్పుడు తమిళ్, తెలుగు సినిమాల భేదం లేకపోవడంతో మన హీరోలని వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటే, వాళ్ళ హీరోలని మనం ట్రోల్ చేస్తూ ఉన్నాం. అందులోనూ అందరికంటే ఎక్కువ ట్రోలింగ్ ఎదుర్కొంటోంది విజయ్. సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే విజయ్ రీమేక్ చేసిన సినిమాల్లోని పాటలని వీడియోలు పోస్ట్ చేసి, “మా సినిమాలని ఒక్కటి కూడా వదలవా? అన్ని సినిమాలని రీమేక్ చేస్తూ ఉంటావా?” అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

vijay 1

విజయ్ ఫ్లాప్ సినిమాల్లోని స్టెప్స్ తీసుకువచ్చి, “ఇలాంటి స్టెప్స్ వేసిన అతను అంత పెద్ద స్టార్ హీరో ఎలా అయ్యాడు?” అంటూ ట్రోల్ చేశారు. ఇది గత సంవత్సరం నుండి నడుస్తూనే ఉంది. ఒక సారి, రెండు సార్లు అంటే బానే ఉంటుంది. కానీ ప్రతి సారి అంత పెద్ద స్టార్ హీరోని ట్రోల్ చేయడం అంటే అది సరైన విషయం కాదు ఏమో అని కామెంట్స్ వస్తున్నాయి. విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమా ఇటీవల విడుదల అయ్యింది. అయితే ఈసారి ఒక సినిమాలో ఒక్క సినిమాని మాత్రమే కాకుండా కొన్ని ఫేమస్ హిట్ తెలుగు సినిమాలు అన్నిటినీ కలిపి రీమేక్ చేశాడు అంటూ కామెంట్స్ చేశారు.

thalapathy 66 vaarasudu story goes viral

అంతే కాకుండా ఈ సినిమాలో విజయ్ వేసిన కొన్ని స్టెప్స్ పై కూడా విపరీతమైన కామెంట్స్ వచ్చాయి. దాంతో చాలా మంది, “కేవలం ఇవి మాత్రమే చూసి విజయ్ మీద కామెడీ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన ఎన్నో మంచి సినిమాలు చేశారు. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవన్నీ కూడా చాలా సంవత్సరాల క్రితం నాటి పాటలు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు విజయ్ తనని తాను నటుడిగా డాన్సర్ గా అన్ని రకాలుగా కూడా ఇంప్రూవ్ చేసుకున్నారు.”

Why this is happening with vijay

“అందుకే ఇప్పుడు అంత పెద్ద స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచారు. ఇప్పుడు ఆ పాత వీడియోలను తీసుకువచ్చి కామెంట్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్?” అని అంటున్నారు. అంతే కాకుండా, “ఒకవేళ ఇప్పుడు మన ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అయిన ఎంతో మంది హీరోల పాత సినిమాలు, వారి పాటలు కూడా చూస్తే ఇలా కామెడీగా ఉన్న డాన్స్ స్టెప్స్ చాలానే ఉంటాయి” అని అంటున్నారు. “హీరోలు అందరూ కూడా అందరం కలిసి ఉంటాం అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే, మనం ఇక్కడ ఇలాంటి కామెంట్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు” అని కామెంట్స్ చేశారు.