Ads
కొంతమంది నటీనటులు వివాదాస్పదమైన మాటలు మాట్లాడో లేదో వారి విచిత్ర ప్రవర్తన వల్లో ఎప్పుడూ వార్తలలో నిలుస్తూ ఉంటారు. నటి వనిత విజయ్ కుమార్ కూడా ఆ కోవ కిందకే వస్తారని చెప్పొచ్చు. ఆమె చేసిన సినిమాల వల్ల కంటే ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ల వలన ఆమె తెలుగునాట ఎక్కువ గా పాపులర్ అయ్యారు.
Video Advertisement
తెలుగు సినిమాలు పెద్ద గా చేయకపోయినా.. వనిత విజయ్ కుమార్ చాలా మంది తెలుగు వారికి తెలిసిన అమ్మాయే. అందుకు ఆమె చేసిన కామెంట్లు కారణం కావచ్చు.. గతేడాదిలోనే మూడో సారి వివాహం చేసుకున్న వనిత విజయ్ కుమార్ తక్కువ కాలం లోనే ఆ వివాహబంధానికి స్వస్తి చెప్పారు. ఈ క్రమం లో ఆమె పై పలు విమర్శలు కూడా వచ్చాయి.
అయితే.. తన వర్క్ అప్ డేట్స్ తో ఆమె అభిమానులతో టచ్ లోనే ఉంటున్నారు. ఇది ఇలా ఉండగా.. ఇటీవల ఆమె “ఆలీ తో సరదాగా” షో కి వచ్చారు. ఈ షో కి సంబంధించిన ప్రోమో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ సందర్భం గా పలు ఆసక్తికర విషయాలను వనిత పంచుకున్నారు. తనకు నాగార్జున అన్నా.. ఎన్టీఆర్ అన్నా చాలా ఇష్టమని.. ఒక్క షాట్ అయినా ఎన్టీఆర్ పక్కన నటించాలి అని ఉందని పేర్కొన్నారు.
అవకాశం వస్తే తప్పకుండ చేస్తానని అన్నారు. ఇంకా దేవి సినిమా షూటింగ్ లో ముచ్చట్లను కూడా ఆమె పంచుకున్నారు. దేవి సినిమా వనిత కు ఎంత పాపులారిటీ తీసుకొచ్చిందో తెలిసిందే. ఈ సినిమా కు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ లో ఒరిజినల్ పాము నే ఉపయోగించారట. అప్పటి విశేషాలను ఆమె వివరిస్తూ వచ్చారు. ఆ విషయాలను ఈ కింద వీడియో లో చూడొచ్చు.
Watch Video:
End of Article