వెంకటేష్ కూతురు పెళ్లి ఎందుకింత సింపుల్ గా జరిపించారు? ఫోటోలు షేర్ చేసేవరకు పెళ్లి జరిగిందనే తెలీదు.!

వెంకటేష్ కూతురు పెళ్లి ఎందుకింత సింపుల్ గా జరిపించారు? ఫోటోలు షేర్ చేసేవరకు పెళ్లి జరిగిందనే తెలీదు.!

by Harika

Ads

హీరో వెంకటేష్ తన రెండవ కూతురు హయ వాహిని పెళ్లిని విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్ తో మార్చి 15 శుక్రవారం రామానాయుడు స్టూడియోలో జరిపించారు. ఈ పెళ్లికి టాలీవుడ్ నుంచి చిరంజీవి. మహేష్ బాబు, రానా, నాగచైతన్య ఇలా చాలామంది ప్రముఖులు హాజరై దంపతులను ఆశీర్వదించారు. పెళ్లి కుమారుడు విజయవాడకు చెందిన డాక్టర్ పాతూరి వెంకటరామారావు తనయుడు.

Video Advertisement

ఇక పెళ్లికి ముందు రోజు జరిగిన మెహందీ ఫంక్షన్ కి మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత, కూతురు సితారతో కలిసి హాజరై సందడి చేశారు. అయితే వెంకటేష్ తన రెండవ కూతురు వివాహాన్ని చాలా సింపుల్ గా కుటుంబ సభ్యుల మధ్యన మాత్రమే జరిపించారు. పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసేంతవరకు వెంకీ కూతురు వివాహం గురించి ఎవరికీ తెలియకపోవటం గమనార్హం. గత ఏడాది హయవాహిని నిశ్చితార్థం ని కూడా అంతే సింపుల్గా చేశారు వెంకటేష్.

చిరంజీవి, మహేష్ బాబు లాంటి ప్రముఖులు విజయవాడలో కనిపించేసరికి అందరూ షాక్ అయ్యారు, షాక్ నుంచి తేరుకునే లోపే వెంకటేష్ కూతురు నిశ్చితార్థం అనే విషయం తెలిసింది. వెంకటేష్ కి హంగులు, ఆర్భాటలు పెద్దగా ఇష్టం ఉండదని అందుకే ఇంత సింపుల్గా చేశారని సన్నిహితుల సమాచారం. వెంకీకి నలుగురు సంతానం పెద్దమ్మాయి ఆశ్రితకు ఇదివరకే పెళ్లి అయింది, ఆమె విదేశాల్లో సెటిల్ అయింది. ఇప్పుడు రెండవ అమ్మాయి హయవాహినికి పెళ్లి జరిగింది.

ఇక మూడవ అమ్మాయి భావన, నాలుగవ సంతానం అబ్బాయి అయిన అర్జున్ ఇద్దరూ ప్రస్తుతం చదువుకుంటున్నారు. ఇక వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల సైంధవ సినిమాతో మన ముందుకు వచ్చిన వెంకటేష్ సరైన హిట్ ని అందుకోలేకపోయాడు. అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన మరొక సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.


End of Article

You may also like