ఆడవారు ఎందుకు చున్నీలు వేసుకోవడం లేదు అన్న ప్రశ్నకి.. ఈ అమ్మాయి ఇచ్చిన సమాధానం వింటే చప్పట్లు కొడతారు..!

ఆడవారు ఎందుకు చున్నీలు వేసుకోవడం లేదు అన్న ప్రశ్నకి.. ఈ అమ్మాయి ఇచ్చిన సమాధానం వింటే చప్పట్లు కొడతారు..!

by Anudeep

Ads

ఈ మధ్య కాలం లో ఫ్యాషన్ ప్రపంచం విస్తృతం గా పెరుగుతోంది. వస్త్ర ధారణ లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమం లో ఆడవారు అయినా, మగవారు అయినా ట్రెండీ గా కనిపించాలని కోరుకుంటున్నారు. ఈ క్రమం లో మగవారి వస్త్రధారణపై కంటే.. ఆడవారి వస్త్రధారణపై ఎక్కువ గా విమర్శలు, జడ్జిమెంట్ లు కనిపిస్తున్నాయి.

Video Advertisement

women with tops 1

representative image

ఆడవారి వస్త్రధారణలో టాప్స్ రెగ్యులర్ వేర్ గా ప్రాచుర్యం పొందాయి. వీటిని లెగ్గింగ్స్ తో జత చేసి వేసుకుంటూ ఉంటారు. ఇవి చూడడానికి పంజాబీ మోడల్ లా ఉన్నప్పటికీ.. వీటికి చున్నీలు లేదా దుపట్టాలు ఉండవు. ఇటీవల వచ్చిన ఈ మోడల్ ను ధరిస్తున్న ఆడవారు ఎవరు వీటిపై చున్నీలను కానీ, దుపట్టాలను కానీ వేసుకోవడం లేదు. ట్రెండీ లుక్ కోసం కొందరు వీటికి జాకెట్ లను జత చేస్తున్నారు.

women with tops 2

representative image

అయితే.. ఈ మధ్య ఆడవారు ఎందుకు చున్నీలు వేసుకోవడం లేదు అన్న ప్రశ్నకు లలిత అనే కోరా యూజర్ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. “నాకు సౌకర్యం గా అనిపించదు కాబట్టే నేను వేసుకోను.. నాకు పదహారేళ్ళ వయసు ఉన్న సమయం లోనే నేను చున్నీ వేసుకున్నప్పుడు, మా అమ్మ చెయ్యి పట్టుకుని నడుస్తున్న రోజులలో కూడా దరిద్రులు చూసే చూపుల్ని సహించాను..

women with tops 3

representative image

నాకు 21 సంవత్సరాల వయసు వచ్చాకా.. కలియుగ దైవం వేంకటేశుడు వెలసిన పుణ్యక్షేత్రం తిరుపతి లో గుండు కొట్టించుకున్న తరువాత కూడా కొందరు నికృష్టుల కళ్ళు నన్ను దహించేస్తూ చూశాయి. కానీ, ఇప్పుడు నేను చున్నీ వేసుకున్నా.. వేసుకోకపోయినా నా దగ్గర ఎవరూ ఎలాంటి వెధవ వేషాలు వెయ్యరు. ఎందుకంటే.. అప్పుడు నాలో లేనిది.. ఇప్పుడు నాలో ఉన్నది ఒకటే..”ధైర్యం”.

karate

representative image

నా చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఏ దరిద్రుడు ఏ చూపుతో నన్ను చూస్తున్నాడో తెలుసుకోగల “తెలివితేటలూ:.. వాళ్ళని తిప్పికొట్టగల “సామర్ధ్యం”.. ఇవే నన్ను ఈరోజు ఇంత ధైర్యం గా సమస్యలను ఎదుర్కొనగలిగేలా చేస్తున్నాయి. మీకు వీలయితే ఆడవారికి ధైర్యం చెప్పండి.. ఇవేమి చేతకాక వస్త్రధారణ, సంప్రదాయం పేరిట ఆడవారికి నియమాలు పెట్టడం వలన ఉపయోగం ఉండదు.. దానికి బదులు కరాటే నేర్పించినా అంతో ఇంతో ఉపయోగం ఉంటుంది..” అంటూ ఆమె సమాధానం ఇచ్చారు.

Note: all the images used in this article are just for representative purpose. But not the actual characters


End of Article

You may also like