తను ఉద్యోగం మానేయటం లేదు… నన్ను మాననియ్యటం లేదు..! ఇప్పుడు నేను ఏం చేయాలి..!

తను ఉద్యోగం మానేయటం లేదు… నన్ను మాననియ్యటం లేదు..! ఇప్పుడు నేను ఏం చేయాలి..!

by Anudeep

Ads

మారుతున్న కాలాన్ని బట్టి భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళని ఎలా సంతోషంగా ఉంచాలనే విషయంపై దృష్టి పెడతారు. కాని కొన్ని కొన్ని సార్లు మన ఉద్యోగరీత్యా పిల్లల కోసం తమ సమయాన్ని కేటాయించాలని పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలను పెంచే విధానంలో కూడా సమస్యలు ఏర్పడతాయి.

Video Advertisement

పిల్లల గురించి సరిగ్గా పట్టించుకోకపోతే వారు దారి తప్పే ప్రమాదం కూడా ఉంటుంది. నాకు ఎవరు తోడు లేరు అనే మానసిక వేదనకు గురవుతారు పిల్లలు. తల్లిదండ్రుల్లో ఒకరు కాకపోయినా ఒకరైన పిల్లలకు అండగా నిలవాలి. వాళ్ల కోసం సమయం కేటాయిస్తే మంచిది అని నేను భావిస్తున్నాను.

ఇప్పుడు ఎదురైన పరిస్థితిలో ఏం చేయాలో నాకు తోచటంలేదు. మా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నాం. వర్క్ ఫ్రమ్ హోం ఆన్లైన్లో ఇంట్లో ఉద్యోగం చేసినంతకాలం మాకు ఎటువంటి సమస్య ఎదురవ్వలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఖచ్చితంగా ఆఫీస్ కి వెళ్లి వర్క్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పిల్లల కోసం మా ఉద్యోగం సమస్యగా మారింది.

ఈ విషయంపై నా భార్యతో చర్చలు జరిపితే, నా భార్య ఉద్యోగం మానమంటే మానట్లేదు. తనకి పరిస్థితి గురించి ఎంత చెప్పిన అర్థం కావడం లేదు. తల్లి ప్రేమ పిల్లలకు ఉన్నప్పుడు మాత్రమే వాళ్లు ప్రయోజకులు కాగలరు.  ఇద్దరం ఉద్యోగాలు చేయడం వలన పిల్లల పెంపకం మీద ప్రభావం పడుతుంది. పోనీ, నేనే ఉద్యోగం మానేస్తాను అంటున్నా ఒప్పుకోవడం లేదు. మరి పిల్లల బాధ్యత  చూసుకోవడం ఎలా అని అడిగిన అర్థం చేసుకోవడం లేదు.  మా పిల్లలను చూసుకోవడానికి మా పెద్దలు ఎవరూ లేరు. డే కేర్ అనే దరిద్రమైన ఆలోచన నాకు లేదు. మన పిల్లల్ని పరాయివారి చేతిలో పెట్టి పెంచడం అనేది అంత మంచిది కాదు అని నా అభిప్రాయం. నా పిల్లలు వేరే వారి చేతిలో పెరగడం అనేది నాకు ఇష్టం లేదు. నా పిల్లలు మా భార్య భర్తల ప్రేమలో పెరగాలని ఆశిస్తున్నాను. అప్పుడే పిల్లల తల్లిదండ్రులు ప్రేమలో  క్రమశిక్షణగా పెరుగుతారని నా నమ్మకం.

ఎందుకంటే మా తల్లిదండ్రుల ప్రేమ లో మేము కూడా అంతే ఆనందంగా, క్రమశిక్షణగా పెరిగి ఈ స్థాయికి వచ్చాము. అమ్మ నాన్నల ఆలనా పాలనలో పిల్లలు ఎంతో సంతోషంగా పెరుగుతారు. అందుకే డే కేర్ లో పిల్లలు వదడం నాకు ఇష్టం లేదు.  ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. నా ఈ సమస్యకు మీరే సరైన పరిష్కారం చెప్పగలరని ఆశిస్తున్నాను.


End of Article

You may also like