కరోనాతో భర్త దూరమైన బాధలో కూడా… ఆమె చేసిన ఈ మంచి పనికి హ్యాట్సాఫ్ అనకుండా ఉండలేరు.!

కరోనాతో భర్త దూరమైన బాధలో కూడా… ఆమె చేసిన ఈ మంచి పనికి హ్యాట్సాఫ్ అనకుండా ఉండలేరు.!

by Megha Varna

Ads

కరోనా మహమ్మారి ఎంతో మందిని బలితీసుకుంది. చాలామంది కరోనా బారినపడి మృతి చెందారు. అలానే ఎంతోమంది కరోనా సోకి ఆసుపత్రి పాలయ్యారు. ఒక ఆమె జీవితంలో ఆనందాన్ని కూడా కరోనా తీసేసుకుంది. కొత్తగా పెళ్ళై కలకాలం కలిసుండాలని అనుకున్న ఆమె పసుపు కుంకుమలని పట్టికెళ్ళిపోయింది. పెళ్లయిన కొద్ది రోజులకే భర్త కరోనా బారిన పడి చనిపోయాడు.

Video Advertisement

దీంతో ఆమె కి కొంత మంది సహాయం చేశారు. అయితే ఆ డబ్బులు ఆమె తీసుకోకుండా ముఖ్యమంత్రి సహాయ నిధికి కొంత మొత్తాన్ని రెడ్ క్రాస్ సొసైటీకి కొంత మొత్తాన్ని ఇచ్చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇక దీనికోసం పూర్తి వివరాల్లోకి వెళితే… ఒడిషాలోని భద్రక్‌ జిల్లా బాసుదేవ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన అభిషేక్‌ మహాపాత్ర ఒమన్ లో ఇంజనీర్ గా పని చేసేవాడు.

గత సంవత్సరం అతను మౌసిమి అనే ఒక ఆమెని వివాహం చేసుకున్నారు. పెళ్లి అయ్యి వారం రోజులు అయింది అంతే అభిషేక్ కి కరోనా వ్యాపించింది. కోవిడ్ చికిత్స కి డబ్బులు లేక పోవడంతో తన భార్య డబ్బులు కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పలువురు ముందుకు వచ్చి ఆమెకి సహాయం చేశారు. ఆసుపత్రిలో మూడు నెలలు కరోనాతో పోరాడి అభిషేక్ కలకత్తా ఆసుపత్రిలోనే మృతి చెందారు. అయితే ఈమెకి సోషల్ మీడియా ద్వారా వచ్చిన డబ్బులు 40 లక్షల రూపాయలు.

ఈ డబ్బులు తన భర్త కి ఉపయోగ పడలేదని.. వేరే వాళ్ళకి ఉపయోగపడాలని ఆమె కోరుకున్నారు. మౌసిమి భద్రక్‌ జిల్లా కలెక్టర్ ని కలిసి 30 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి, 10 లక్షల రూపాయలు రెడ్ క్రాస్ సొసైటీకి అందించారు. అయితే చాలా మంది తన భర్త కోసం సహాయం అందించారని.. అయితే ఈ సహాయం అతనికి ఉపయోగపడలేదని.. అవసరమైన వాళ్ళకు ఉపయోగపడాలని ఆమె ఇచ్చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.


End of Article

You may also like