ఒక తల్లి తన కూతురి గురించి రాసిన ఈ ప్రశ్న చూశారా..? పెళ్లి కోసం ఇలాంటి అబ్బాయి కావాలట..!

ఒక తల్లి తన కూతురి గురించి రాసిన ఈ ప్రశ్న చూశారా..? పెళ్లి కోసం ఇలాంటి అబ్బాయి కావాలట..!

by Harika

Ads

సాధారణంగా పెళ్లి చేసుకోవాలి అంటే అవతలి వ్యక్తిలో కొన్ని లక్షణాలు ఉండాలి అని చాలా మంది అనుకుంటారు. అలాంటి లక్షణాలు ఉన్న వారిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. అయితే కొంత మంది లక్షణాలు మాత్రం మరి విపరీతంగా ఉంటాయి. వాటికి పరిష్కారం ఏంటో కూడా అర్థం కాదు. అలాంటి ఒక పరిస్థితి ఒక వ్యక్తికి కలిగింది. ఆమె ఈనాడులో వసుంధరకి తన కూతురు ఇలా అడుగుతోంది అంటూ ఒక ప్రశ్న రాశారు. ఈనాడులో వసుంధర పేపర్ లో ఆడవారు కొన్ని ప్రశ్నలు అడిగితే దానికి నిపుణులు సమాధానం చెప్తూ ఉంటారు. అలా జానకి గారు, మానసిక నిపుణురాలు అయిన డాక్టర్ మండాది గౌరీ దేవి గారిని ఈ ప్రశ్న అడిగారు.

Video Advertisement

woman about her daughter

జానకి గారు తన ప్రశ్నలో ఈ విధంగా రాశారు. ఈ ప్రశ్నలో జానకి గారు, “మా అమ్మాయి వయసు 22. డిగ్రీ పూర్తయింది. తను కొరియన్ సిరీస్ లు పిచ్చిగా చూస్తూ ఉంటుంది. ప్రతి విషయాన్ని వాళ్ళతో పోల్చుకుంటోంది. ఇప్పుడు తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. తనేమో కొరియన్ యువకుడిని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను అని మొండికేస్తోంది. ఎలా నచ్చచెప్పాలో తెలియడం లేదు. సలహా ఇవ్వగలరు” అని రాశారు. ఇందుకు గౌరీ దేవి గారు, సాధారణంగా యుక్త వయసులో ఉన్న ఎంతో మంది ఇలా సినిమాలు సిరీస్ చూసి ప్రభావితులు అవుతూ ఉంటారు అని, దానికి థెరపీ అవసరం అని చెప్పారు.

అయితే, ఇది కేవలం ఇక్కడ చెప్పిన అమ్మాయి గురించి మాత్రమే కాదు. అసలు అమ్మాయిల గురించి మాత్రమే కాదు. చాలా మంది యువతీ యువకులు ఇలాగే సినిమాలు చూసి, లేదా సిరీస్ చూసి నిజ జీవితంలో అలాగే ఉంటారు అని అనుకుంటున్నారు. అందుకే వాళ్ల జీవితం కూడా అలాగే ఉండాలి అని ఆశపడుతూ ఉంటారు. ఒకవేళ అలా లేకపోతే దానికి చాలా బాధపడుతూ ఉంటారు. ఈ విషయాన్ని కోరాలో గణ గారు షేర్ చేశారు.


End of Article

You may also like