“కాబోయే కోడలు ఇలా ఉండాలి..!” అంటూ… ఈ మహిళ చెప్పిన లక్షణాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

“కాబోయే కోడలు ఇలా ఉండాలి..!” అంటూ… ఈ మహిళ చెప్పిన లక్షణాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Mohana Priya

సాధారణంగా పెళ్లి అన్న తర్వాత అబ్బాయికి, అమ్మాయికి ఇద్దరికీ కొన్ని అంచనాలు ఉంటాయి. వారికి కాబోయే వారు ఎలా ఉండాలి, వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే ఆలోచన ఉంటుంది. కొంతమంది అంచనాలు విచిత్రంగా ఉంటే మరి కొంత మంది మాత్రం అంత ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు.

Video Advertisement

వారి ఆలోచనలన్నిటిని మ్యారేజ్ బ్యూరో వారికి కానీ, వారి తల్లిదండ్రులకి కానీ చెప్తారు. దానికి తగ్గట్టుగా వారికి కాబోయే వారిని వెతుకుతారు. కొంతమందికి లిస్ట్ ఉంటుంది.

Love-Marriage-Vs-Arrange-Marriage

అయితే ఇలా తన కొడుకుకి ఎలాంటి అమ్మాయి కావాలి, వారి ఇంటికి వచ్చే కోడలు ఎలా ఉండాలి అని చెప్తూ ఒక మహిళ తన కొడుకు కోసం సంబంధాలని వెతకడానికి ఒక వీడియో బైట్ ఇచ్చారు. ఇందులో ఆ మహిళ, తన కొడుకు ఇద్దరూ వచ్చి కూర్చున్నారు. కానీ ఆవిడ చెప్పిన లక్షణాలు మాత్రం విచిత్రంగానే ఉన్నాయి. అవేంటంటే.

woman describing the qualities of her daughter in law

# నేను ఒక వెర్సటైల్ (చాలా గుణాలు ఉన్న) అబ్బాయి తల్లిని. మేము పెళ్లి కోసం ఒక వెర్సటైల్ అమ్మాయి కోసం వెతుకుతున్నాము. ఆ అమ్మాయికి కిచెన్ కి సంబంధించిన అన్ని విషయాలు తెలిసి ఉండాలి. థాయి ఫుడ్ చేయడం వచ్చి ఉండాలి.

# అమ్మాయి ఇంట్లో నుండి పార్ట్ టైం ఉద్యోగం చేయవచ్చు. కానీ బయటికి వెళ్లి పని చేయాలి అనుకుంటే నా కొడుకు వచ్చేలోపే తాను ఇంటికి వచ్చేయాలి. నా కొడుకుని స్వాగతించాలి.

# పొగ తాగడం, మందు సేవించడం లాంటి అలవాట్లు ఆ అమ్మాయికి ఉండకూడదు.

# నా కొడుకుకి సిగ్గు ఎక్కువ. అందుకే ఆ అమ్మాయి అందరి ముందు మా అబ్బాయి చేయి పట్టుకోవడం లాంటివి చేయకూడదు.

# అమ్మాయి ఎప్పుడు డీసెంట్ గా డ్రెస్ చేసుకోవాలి. నా కొడుకుతో ఉన్నప్పుడు కూడా డీసెంట్ గా డ్రెస్సింగ్ ఉండాలి.

ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే మాకు మెయిల్ చేయండి. అంటూ ఆ వ్యక్తి వీడియో చేశారు. ఈ వీడియో ఇప్పటిది కాదు. దాదాపు పది సంవత్సరాల క్రితం వీడియో. కానీ సోషల్ మీడియాలో మాత్రం దీని గురించి చాలా కామెంట్స్ వచ్చాయి. అసలు ఈ వీడియో నిజమైనదా? లేదా స్క్రిప్ట్ ఇచ్చి చేయించినదా? అనేది కూడా అర్థం కాదు. కానీ ఏదేమైనా ఒక సమయంలో చాలామందికి ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి లేదా అబ్బాయి కావాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇది సహీ రిష్తా అనే ఒక మ్యాట్రిమోనియల్ కంపెనీ కోసం చేశారు. దాంతో చాలా మంది ఇది నిజం అని కూడా అంటున్నారు.

watch video :

ALSO READ : RTC బస్ లో మహిళలకు ఉచిత ప్రయాణం…ఇక మీదట ఇది తప్పనిసరి..లేదంటే టికెట్ తీసుకోవాలి.!


You may also like

Leave a Comment