Ads
ప్రతి రోజు నిత్యం ఎక్కడో ఒక చోట మహిళల పట్ల దాడికి జరిగిందని, వాళ్ళని హింసించారని, వేధించారని టివి లో వస్తున్న న్యూస్ ని చూసి ఉంటాము… విని ఉంటాము. ఈ విషయం లో పోలీసుశాఖ వారు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా ఇలాంటివి ఆగడంలేదు. సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన నేపథ్యంలో ఇలాంటి వార్తలు మరింత ఎక్కువ గా బయటకు వస్తున్నాయి. కొందరు బయటికి చెబుతున్నప్పటికీ మరి కొందరు చెప్పలేని పరిస్థితి. మహిళల పై జరుగుతున్న నేరాలకు సైబరాబాద్ పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ వారికి అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎప్పటికప్పుడు షీ టీమ్స్ మహిళలకోసం పని చేస్తూనే ఉన్నారు.
Video Advertisement
తాజాగా సైబరాబాద్ పోలీసులు తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా సోషల్ మీడియా లో మహిళలపై వస్తున్నవేధింపులపైన ఎలా స్పందించాలి.., పోలీసుల దృష్టికి ఎలా తీసుకురావాలి.. అనే దానిపై ట్విట్టర్ లో ఒక వాట్స్ అప్ చాట్ ని పోస్ట్ చేసారు. సాఫ్ట్ వేర్ కంపెనీ లో పని చేస్తున్న ఒక యువతి తన బాస్ నుంచి ఎదురయ్యే వేధింపులని ఎలా ఎదుర్కొంది? అనే దానిపైన మహిళలకి అవగాహనా కల్పించే ప్రయత్నం చేసారు సైబరాబాద్ పోలీసులు. ఆ యువతి పని చేస్తున్న కంపెనీ లో తన బాస్ ప్రాజెక్టు ని అప్రూవ్ చేయాలన్నా, శాలరీ లో హైక్ రావాలన్నా తను చెప్పినట్టు వినాలని, ఓయో రూమ్స్ కి రావాలని బెదిరిస్తాడు. తన బాస్ కి అద్దిరిపోయే సమాధానం ఇస్తుంది ఆ యువతి. ఇలాంటి వాటిపై అవగాహన కల్పించడం నిజంగా అభినందనీయం.. నెటిజన్స్ పోలీసులకి హాట్స్ ఆఫ్ చెబుతున్నారు.
End of Article