Ads
వాష్ రూమ్, ఫుడ్ ఈ రెండు కలిపి చదువుతుంటేనే అదోలా ఉంది కదా? అసలు ఈ కాంబినేషన్ ఊహించడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. చాలా మంది కాదు అసలు ఎవరూ ఇష్టపడరు. ఒక యువతి మాత్రం కమోడ్ లో ఫుడ్ తయారు చేసి అది తన స్నేహితులకు పెట్టారు. మీరు చదివింది కరెక్టే. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ యువతి.
Video Advertisement
ముందు ఆ కమోడ్ సీట్లో ఒక షర్ట్ పెట్టి బ్లాక్ చేశారు. తర్వాత అందులో ఐస్ క్యూబ్స్ వేశారు. అక్కడితో ఆగలేదు. ఐస్ క్యూబ్స్ పై ఐస్ క్రీమ్ వేశారు. దానిపై పై క్యాండీ వేశారు. ఇవన్నీ వేసిన తర్వాత కమోడ్ మూత పెట్టేసారు. ఆ తర్వాత ఫ్లష్ ఓపెన్ చేసి ఇ అందులో క్యాండీ వేశారు. అందులో మళ్ళీ కూల్ డ్రింక్ పోశారు. అది కూడా ఒకటి కాదు. కొన్ని రకాల కూల్ డ్రింక్ లని కలిపారు.
ఆ తర్వాత ఫ్లష్ మీద మూత పెట్టేసారు. అప్పుడు ఫ్లష్ తిప్పారు. దాంతో అంతకుముందు ఫ్లష్ లో వేసిన కూల్ డ్రింక్ మొత్తం కమోడ్ లోకి వచ్చింది. దీన్ని తీసి గ్లాస్ లో పోసి తన మిత్రులకు సర్వ్ చేశారు. వారందరూ ఈ కూల్ డ్రింక్ ని చీర్స్ చెప్పుకొని మరీ తాగారు.
స్నేహితులలో ఒకరు “దీన్ని ఎలా చేసావు?” అని అడగగా అందుకు ఆ యువతి “టాయిలెట్ బౌల్ పంచ్ రెసిపీ” అని చెప్పారు. అంతే కాకుండా ఇది తయారు చేసే ముందు టాయిలెట్ ని క్లీన్ చేశాను అని కూడా చెప్పారు ఆ యువతి. వారిలో ఒక యువతి వెళ్ళి ఆ కూల్ డ్రింక్ ని అదే కమోడ్ లో పారబోసేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
watch video :
End of Article