Home Off Beat టాయిలెట్ బౌల్ లో ఐస్ క్రీం,కూల్ డ్రింక్ మిక్స్ చేసి ఫ్రెండ్స్ కి ఇచ్చింది…చివరికి.?

టాయిలెట్ బౌల్ లో ఐస్ క్రీం,కూల్ డ్రింక్ మిక్స్ చేసి ఫ్రెండ్స్ కి ఇచ్చింది…చివరికి.?

by Mohana Priya

వాష్ రూమ్, ఫుడ్ ఈ రెండు కలిపి చదువుతుంటేనే అదోలా ఉంది కదా? అసలు ఈ కాంబినేషన్ ఊహించడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. చాలా మంది కాదు అసలు ఎవరూ ఇష్టపడరు. ఒక యువతి మాత్రం కమోడ్ లో ఫుడ్ తయారు చేసి అది తన స్నేహితులకు పెట్టారు. మీరు చదివింది కరెక్టే. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ యువతి.

ముందు ఆ కమోడ్ సీట్లో ఒక షర్ట్ పెట్టి బ్లాక్ చేశారు. తర్వాత అందులో ఐస్ క్యూబ్స్ వేశారు. అక్కడితో ఆగలేదు. ఐస్ క్యూబ్స్ పై ఐస్ క్రీమ్ వేశారు. దానిపై పై క్యాండీ వేశారు.  ఇవన్నీ వేసిన తర్వాత కమోడ్ మూత పెట్టేసారు. ఆ తర్వాత ఫ్లష్ ఓపెన్ చేసి ఇ అందులో క్యాండీ వేశారు. అందులో మళ్ళీ కూల్ డ్రింక్ పోశారు. అది కూడా ఒకటి కాదు. కొన్ని రకాల కూల్ డ్రింక్ లని కలిపారు.

Woman made ice cream and cool drink in toilet bowl

ఆ తర్వాత ఫ్లష్ మీద మూత పెట్టేసారు. అప్పుడు ఫ్లష్ తిప్పారు. దాంతో అంతకుముందు ఫ్లష్ లో వేసిన కూల్ డ్రింక్ మొత్తం కమోడ్ లోకి వచ్చింది. దీన్ని తీసి గ్లాస్ లో పోసి తన మిత్రులకు సర్వ్ చేశారు. వారందరూ ఈ కూల్ డ్రింక్ ని చీర్స్ చెప్పుకొని మరీ తాగారు.

Woman made ice cream and cool drink in toilet bowl

స్నేహితులలో ఒకరు “దీన్ని ఎలా చేసావు?” అని అడగగా అందుకు ఆ యువతి “టాయిలెట్ బౌల్ పంచ్ రెసిపీ” అని చెప్పారు. అంతే కాకుండా ఇది తయారు చేసే ముందు టాయిలెట్ ని క్లీన్ చేశాను అని కూడా చెప్పారు ఆ యువతి. వారిలో ఒక యువతి వెళ్ళి ఆ కూల్ డ్రింక్ ని అదే కమోడ్ లో పారబోసేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Woman made ice cream and cool drink in toilet bowl

watch video :

https://www.facebook.com/WatchTheAnnaShow/videos/688961215148873/?t=3

 

You may also like