Ads
మనకు బాగా ఇష్టమైన వ్యక్తులు దూరమైతే.. ఆ బాధ వర్ణనాతీతం గా ఉంటుంది. వారికి సంబంధించిన వస్తువులను మనం పదిలం గా దాచుకుని, వాటిని చూస్తూ వారితో ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటాం. అయితే.. ఓ మహిళ తన సన్నిహితురాలు చనిపోవడం తో అంతులేని విషాదం లోకి వెళ్ళిపోయింది. ఆ విషాదం లో నుంచే ఆమెకు ఒక ఐడియా వచ్చింది. అదే.. చనిపోయిన వ్యక్తుల నుంచి సేకరించిన అవశేషాలతో ఆభరణాలను తయారు చేయడం. చూస్తుండగానే.. ఆమె ఐడియా ఎందరికో నచ్చి.. ఆమెకు ఆర్డర్స్ రావడం మొదలైంది. ఆమె స్టోరీ ఏంటో చూద్దాం..
Video Advertisement
ఆస్ట్రేలియా కు చెందిన జాక్వి విలియమ్స్ అనే ఓ మహిళ చనిపోయిన వ్యక్తుల దంతాలు, వెంట్రుకలతో ఉంగరం, చైన్, ఇయర్ రింగ్స్ వంటి ఆభరణాలను తయారు చేస్తోంది. చనిపోయిన వ్యక్తుల బూడిద గాని, దంతాలు, వెంట్రుకలను ఇచ్చినా సరే వాటిని ఆమె అందమైన ఆభరణాలుగా మార్చి ఇస్తోంది. చనిపోయిన వారి గుర్తు గా ఇలాంటి ఆభరణాలను తయారు చేయించుకోవడానికి ఎందరో ఆసక్తిని కనబరుస్తున్నారు.
ఆమె గతం లో స్మశానం లో తోటమాలి గా పనిచేసేవారు. ఆ తరువాత ఆమె ఆభరణాల తయారీ పై పాలిటెక్నిక్ ను కూడా చదువుకున్నారు. ఉద్యోగ ప్రయత్నాలలో కూడా ఆమె చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. ఈ సమయంలోనే తన స్నేహితురాలు చనిపోవడం తో తీవ్ర వేదనకు గురి అయింది. ఆ సమయం లో చనిపోయిన వ్యక్తుల గుర్తు గా.. వారి అవశేషాలతో ఏమైనా ఆభరణాలను తయారు చేయాలనీ జాక్వి నిర్ణయించుకుంది. అందుకోసమే.. “గ్రేవ్ మెటల్లమ్ జ్యువలరీ” అనే సంస్థ ని కూడా స్థాపించింది.
దంతాలు, అస్థికలు, వెంట్రుకలు.. ఇలా ఏవి తీసుకొచ్చినా వాటి తో ఆమె అందమైన ఆభరణాలను రూపొందించి ఇచ్చేది. ఇందుకోసం రోజూ ఆమెకు చాలా రిక్వెస్ట్ లు వస్తూ ఉంటాయట. ఐతే.. కొన్నిటిని ఆమె రిజెక్ట్ చేశారట. ఎందుకంటే.. ఒక వ్యక్తి ఒక బుల్లెట్ ను తీసుకొచ్చి నగ చేయమని అడిగాడట. అతని తాతగారు.. ఆ బుల్లెట్ తోనే పేల్చుకుని, ఆత్మహత్య చేసుకున్నారట.
అయితే.. జాక్వి సున్నితం గా తిరస్కరించారు. ఇలాంటి వాటితో తాను చేయనని.. తాను కేవలం మనిషి అవశేషాలతో మాత్రమే చేస్తానని చెప్పారట. ఒక్కొక్క ఆభరణం తయారీ కి ఆమె కు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందట. అలాగే ఒక్కొక్క నగ కోసం రూ.19,500 నుంచి రూ.5.5 లక్షల రూపాయల వరకు ఆమె వసూలు చేస్తారట. ఆమె చేసిన నగలపై ఓ లుక్ వేయండి.
#1.
#2.
#3.
#4.
#5.
End of Article