Ads
నెలసరి సమయంలో పాటించవలసిన జాగ్రత్తలు ఎన్నో ఉంటాయి. అవి సరిగా పాటించకుండా చేసే కొన్ని తప్పులు కారణంగా ఆడవారు నెలసరి నొప్పులు మరియు ఇతర కాంప్లికేషన్స్ తో బాధపడుతూ ఉంటారు. నిపుణుల సూచన ప్రకారం నెలసరి సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు. మరి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం..
Video Advertisement
సహజంగానే పీరియడ్స్ చాలామందికి ఇబ్బందికరమైన సమస్య. కొంతమందికి ఈ నెలసరి సమయంలో కడుపునొప్పి ,నడుము నొప్పి ,కాళ్లు లాగడం, చిరాకు, వాంతులు, కళ్ళు తిరగడం లాంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇది తగ్గించుకోవడం కోసం వారు పలు రకాల టాబ్లెట్స్ తీసుకోవడం లేదా జంక్ ఫుడ్ తినడం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల పీరియడ్స్ లో నొప్పుల సమస్య తగ్గడం బదులు విపరీతంగా పెరుగుతుంది అని నిపుణులు చెబుతున్నారు.
వర్కౌట్ ఎక్కువగా చేయవద్దు..
కొంతమంది పీరియడ్స్ టైం లో కూడా తమ రెగ్యులర్ వర్కౌట్స్ చేయడానికి ఇష్టపడతారు. కానీ మరీ ఇంటెన్స్ వర్క్ఔట్స్ చేస్తే మాత్రం శరీరంలోని అడ్రినలిన్ హార్మోన్ పెరుగుతుంది. అంతేకాకుండా హెవీ వర్క్ బాక్స్ వల్ల పొట్టపై ఎక్కువ వత్తిడి ఏర్పడి కడుపునొప్పి, నడుము నొప్పి ఎక్కువగా కలుగుతాయి.
బెడ్ కి అతుక్కుపోవద్దు..
చాలామంది పీరియడ్స్ టైం లో బెడ్ మీద రెస్ట్ తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. రోజంతా అలా బెడ్ మీద ఉండడం వల్ల నొప్పి, తిమ్మిర్లు ఎక్కువ అవుతాయి తప్ప తగ్గవు. ఈ సమయంలో లైట్ గా బాడీకి స్ట్రెచింగ్ ,వాకింగ్ ,బ్రీతింగ్ ఎక్ససైజ్ వంటివి చేయడం మంచిది అని నిపుణులు అంటున్నారు.
తలస్నానం
చాలామంది పీరియడ్స్ వచ్చిన వెంటనే తలస్నానం చేస్తారు. మూడవ రోజు, ఐదవ రోజు అని వరుసగా చేస్తూనే ఉంటారు. ఈ సమాయం లో ఇలా చేయడం వల్ల తలనొప్పి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో తరచూ తలస్నానం చేయడం మంచిది కాదు.
ఇటువంటి యోగాసనాలకు దూరం…
చాలామంది పీరియడ్స్ టైం లో యోగా చేస్తే రిలాక్సేషన్ ఉంటుంది అంట. ఇందులో నిజం ఉంది కానీ ఈ సమయంలో శరీరాన్ని తలకిందులు చేసే యోగాసనాలు అస్సలు వేయకూడదు. అంటే శీర్షాసనం, హలాసనం, సర్వాంగాసనం లాంటి కాళ్ళు పైకి లేపి చేసే ఆసనాలకు దూరంగా ఉండాలి. ఇది పీరియడ్స్ లక్షణాలను తగ్గించడానికి మరింత పెంచుతుంది.
ఇటువంటివి అస్సలు తినవద్దు…
చాలామంది నెలసరి సమయంలో చాక్లెట్స్ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. కొందరు మిల్క్ షేక్, పిజ్జా, బర్గర్ లాంటి జంక్ ఫుడ్స్ ఎక్కువగా ఈ సమయంలో తీసుకుంటారు.. వీటివల్ల మీ నెలసరి నొప్పుల్లో ఎటువంటి మార్పు రాదు సరి కదా బరువు మాత్రం బాగా పెరుగుతారు. కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి.
ALSO READ : సినిమా మొదలయ్యే ముందు “నా పేరు ముఖేష్” అంటూ కనిపించే… “గుట్కా ముఖేష్” రియల్ స్టోరీ తెలుసా…?
End of Article