సినిమా మొదలయ్యే ముందు “నా పేరు ముఖేష్” అంటూ కనిపించే… “గుట్కా ముఖేష్” రియల్ స్టోరీ తెలుసా…?

సినిమా మొదలయ్యే ముందు “నా పేరు ముఖేష్” అంటూ కనిపించే… “గుట్కా ముఖేష్” రియల్ స్టోరీ తెలుసా…?

by kavitha

Ads

సినిమా మొదలయ్యే ముందు రకరకాల ప్రకటనలు వస్తూంటాయి. వాటిలో ముఖ్యంగా గుట్కా ముఖేష్ గురించి వచ్చే ప్రకటన అందరు చూసే ఉంటారు. అయితే అతను ఆ ప్రకటన చేయడం వెనుక ఉన్న కారణం ఏమిటో చాలామందికి  తెలియదు. ముఖేష్ రియల్ స్టోరీ గురించి ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

మహారాష్ట్రలో ఉండే చిన్న గ్రామంలో ముఖేష్ జీవించేవాడు. ముఖేష్ కూలి పని చేస్తూ తన ఇంటిని పోషించేవాడు. అతని సంపాదన పైనే ఫ్యామిలీ ఆధారపడి బ్రతుకుంది. ఇలా సాగుతున్న ముఖేష్ జీవితంలో తనతో పాటు కూలి పని చేసే స్నేహితులతో పాటుగా గుట్కా తినడం అలవాటు చేసుకున్నాడు. దాంతో క్రమంగా ముఖేష్ ఆరోగ్యం పూర్తిగా పాడైంది. ఫ్యామిలీ మెంబర్స్ ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదు. ఆఖరికి ముఖేష్ ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఇక ఈ యాడ్ చేయడం కోసం కొంతమంది ముఖేష్ దగ్గరికి వెళ్లి అడిగిన సమయంలో ముఖేష్ మాట్లాడే కండిషన్ లో లేడు. ఆఖరికి ప్రకటన చేయడానికి అంగీకరించాడు.ముఖేష్ అతి కష్టం మీద గుట్కా తినకూడదని, గుట్కా తినకూడదని, మానేయమని తన కుటుంబ సభ్యులు ఎన్నో సార్లు తనకు చెప్పారని,కొన్ని సందర్భాల్లో మా అమ్మ నన్ను కొట్టింది గుట్కా మానేయమని చెప్పింది. కానీ అప్పుడు ఎవరి మాట వినలేదు అని ముఖేష్ చెప్పడం జరిగింది. తాను ఆ విధంగా చెప్పడం వల్ల కొందరయినా మారుతారనే ఉద్దేశ్యంతో ముఖేష్ ఈ ప్రకటన చేయడానికి అంగీకరించాడట. అతను 2009లో కన్నుమూశారు. అతను మరణించిన తరువాత 2011 నుండి ముఖేష్ యాడ్ ని ఉపయోగించడానికి ‘నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టొబాకో ఏరాడికేషన్ సంస్థ’ అనుమతిని ఇచ్చింది. అప్పటి నుండి ప్రసారం అయిన ఈ యాడ్ 2013 దాకా కొనసాగించారు. తనలా మరొకరు మరకూడదు అనే మంచి ఉద్దేశ్యంతో మాట్లాడలేని స్థితి అయినప్పటికి ఈ ప్రకటన చేసిన ముఖేష్ ను చూసి అయినా ఇటువంటి చెడు అలవాట్లకు అందరు దూరంగా ఉంటే చాలా మంచిది.

Also Read: జీవితంలో ఇంత గొప్ప స్థాయికి ఎదగడానికి “సుధామూర్తి” పాటించిన సూత్రాలు ఏవో తెలుసా..?


End of Article

You may also like