చిన్మయి శ్రీపాద వాడిన ఆ పదం ఏంటి..? అసలు ఆమె మీద కేసు ఎందుకు ఫైల్ చేశారు..?

చిన్మయి శ్రీపాద వాడిన ఆ పదం ఏంటి..? అసలు ఆమె మీద కేసు ఎందుకు ఫైల్ చేశారు..?

by Mounika Singaluri

Ads

సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సంవత్సరాల నుండి సినిమాల్లో ఉండి, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు చిన్మయి శ్రీపాద. చిన్మయి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. చాలా విషయాల మీద తన అభిప్రాయాలని వ్యక్తపరుస్తూ ఉంటారు. సమాజంలో జరిగే కొన్ని విషయాల గురించి మాట్లాడి, అందులో ఏదైనా తప్పు అనిపిస్తే ఆ విషయాన్ని కూడా చెప్తారు.

Video Advertisement

కట్నం లాంటి విషయాలు తప్పు అని సోషల్ మీడియా ద్వారా ఎన్నో సార్లు చిన్మయి చెప్పారు. అలాగే సమాజంలో ఎన్నో విషయాలు కరెక్ట్ అనుకున్నవి కూడా కరెక్ట్ కాదు అని చెప్పారు. ఎంతో మంది మహిళలు కూడా చిన్మయి చెప్పిన మాటలకు ఏకీభవిస్తూ పర్సనల్ గా మెసేజెస్ చేస్తారు.

ఆ మెసేజెస్ ని కూడా చిన్మయి షేర్ చేసి, సమాజం గురించి, ఇప్పుడు వ్యక్తులు ఎలా ఉన్నారు అనే విషయం గురించి, సోషల్ మీడియా ద్వారానే అవగాహన కల్పిస్తూ ఉంటారు. అయితే, ఇటీవల సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గారు మాట్లాడిన ఒక వీడియో మీద చిన్మయి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాంట్లో చిన్మయి వాడిన ఒక పదం అభ్యంతరకరంగా అనిపించడంతో, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో చిన్మయి మీద కేసు ఫైల్ చేశారు.

ఆ వీడియోలో చిన్మయి మాట్లాడుతూ, భారతదేశాన్ని ఉద్దేశించి, స్టుపిడ్ కంట్రీ అని అన్నారు. ఈ పదం వాడడంతో, ఇలాంటి పదం వాడడాన్ని ఖండిస్తూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి అయిన కుమార స్వామి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో చిన్మయి మీద ఫిర్యాదు చేశారు. ఒకవేళ అన్నపూర్ణమ్మ గారు మాట్లాడినవి కరెక్ట్ కాదు అనుకుంటే, ఏదైనా చెప్పాలి అంటే అన్నపూర్ణమ్మ గారికి మాత్రమే చెప్పాలి.

annapoorna chinmayi

అంతే కానీ భారతదేశం గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని కుమార స్వామి చెప్పారు. భారతదేశంలోనే నివసిస్తూ, ఇక్కడి వసతులు అన్నీ కూడా ఉపయోగిస్తూ, ఇక్కడి గాలి పీలుస్తూ, ఇలాంటి ఒక దేశంలో పుట్టడం ఖర్మ అనడం, భారతదేశాన్ని చెత్త దేశం అని అనడం బాధాకరం అని కుమార స్వామి చెప్పారు. ఒక బాధ్యత గల భారతదేశ పౌరుడిగా, ఇలాంటి అగౌరవమైన, అనుచితమైన వ్యాఖ్యలని తాను ఖండిస్తూ ఫిర్యాదు ఇచ్చినట్లు చెప్పారు. చిన్మయి మీద తగిన చర్య తీసుకోవాలి అని కుమార స్వామి పోలీస్ స్టేషన్ లో కోరారు.

ALSO READ : ఆ మహానుభావుడి గుర్తుగానే రామేశ్వరం కేఫ్ కి ఈ పేరు పెట్టారా..? ఏంటి ఈ కేఫ్ యొక్క ప్రత్యేకత..?


End of Article

You may also like