Ads
ప్రపంచంలో ఎన్నో ఉద్యోగాలు ఉంటాయి. ఒక మనిషి అనుకుంటే ఏ ఉద్యోగం అయినా కూడా చేసి సంపాదించవచ్చు. అన్ని రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఎంత చదువుకున్నా, అసలు చదువుకోకపోయినా కూడా ఉద్యోగం చేయొచ్చు. అలా ఎన్నో ఉపాధులు కల్పిస్తున్నారు. అలా కొంత మంది ఉద్యోగాల్లో చేరి, ఎంతో కష్టపడి, ఎంతో పై స్థాయికి ఎదుగుతున్నారు. ఉద్యోగంలో స్థాయి పెరుగుతున్న కొద్ది జీతం కూడా పెరుగుతుంది. కానీ ఒక ఉద్యోగానికి మాత్రం పని ఎంత పెరుగుతున్నా, ఎంత ప్రమోషన్ వచ్చినా కూడా జీతం మాత్రం పెరగదు.
Video Advertisement
అదే ఇంట్లో ఉండి ఇంటి బాధ్యతలు తీసుకునే ఉద్యోగం. ఇది సాధారణంగా ఆడవాళ్లు ఎక్కువగా చేస్తారు. అందుకే, గృహిణి అనే పదం ఉంది. గృహిణి అంటే ఇంట్లో ఉండే ఆడవారు కాదు. ఇంటి బాధ్యతలు తీసుకొని అవన్నీ నిర్వర్తించే ఆడవారు అని. చాలా మంది గృహిణులు ఎదుర్కొనే ప్రశ్న ఒకటే. నువ్వు ఇంట్లో ఖాళీగానే ఉంటావు కదా? అంత ఎందుకు అలిసిపోతావు? ఈ ప్రశ్న ఎదుర్కోని గృహిణులు ఉండరు. మొదట వీరి పని తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ పని పెరుగుతుంది. పిల్లలు పెద్దవారు అవుతుంటే పనులు కూడా పెరుగుతాయి.
దాంతో తమకంటూ సమయం కేటాయించుకునే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ అలా కేటాయించుకున్నా కూడా ఆ మహిళలని స్వార్థపరులు అనే ఒక ముద్ర వేసేస్తారు. ఇంత పని చేస్తారు. వారికి జీతం వస్తుందా అంటే అది కూడా ఉండదు. ఇంటి ఖర్చులకి ఇంట్లో సంపాదించే వాళ్ళు డబ్బులు ఇస్తారు. కానీ వారి సొంత ఖర్చులకి మాత్రం చాలా తక్కువ డబ్బులు మిగులుతాయి. అడిగినా కూడా, “మొన్నే కదా అన్ని డబ్బులు ఇచ్చింది?” అనే ప్రశ్న వస్తుంది. ప్రతి మనిషికి తనకోసం తను ఏదైనా చేసుకోవాలి అని ఉంటుంది.
అందుకోసం ఒక్కొక్కసారి కొంత ఖర్చు కూడా అవుతుంది. సంపాదించే వాళ్లు ఇవన్నీ చాలా సులభంగా చేసుకోగలుగుతారు. కానీ సంపాదించని వాళ్ళు ఇలాంటి వాటిని వాయిదా వేస్తూ, కొన్ని పనులు అయితే చేయకుండానే వదిలేస్తారు. తర్వాత అప్పుడు అలా చేయాలి అని ఆశ ఉండేది అని వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అందుకే ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన ఉద్యోగం ఇదే. ఈ బాధ్యత తీసుకోవడం అంత కష్టమైన పని మరొకటి ఉండదు.
ALSO READ : చీరలు కట్టుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందా..? శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే..?
End of Article