Ads
2023లో ఇప్పటివరకు రిలీజ్ అయిన తెలుగు చిత్రాలలో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచాయి. వాటిలో కొన్ని చిత్రాలు భారీ బడ్జెట్ తో, స్టార్ హీరోల చిత్రాలు కూడా ఉన్నాయి. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు, భారీ అంచనాలు పెరిగేలా చేశాయి.
Video Advertisement
ఎన్నో అంచనాలతో థియేటర్లలో అడుగు పెట్టిన ఆడియెన్స్ వాటిని చూసి నిరాశ పడ్డారు. అలా వచ్చిన వాటిలో కొన్ని సినిమాలు భారీ నష్టాలను మిగిల్చి బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. అయితే ఆ చిత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. 1. శాకుంతలం:
సమంత నటించిన ఈ చిత్రాన్ని గుణశేఖర్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఆకట్టుకొని విఎఫ్ఎక్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకునేలా లేదు. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి వంటి వారు ఉన్నప్పటికీ ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. 2. ఏజెంట్:
ఈ చిత్రం కోసం యంగ్ హీరో అఖిల అక్కినేని చాలా కష్టపడి, బాడీ బిల్డ్ చేసి, రెండేళ్ళ పాటు దానిని మెయింటైన్ చేస్తూ ఎఫర్ట్స్ పెడితే ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీలో స్టోరీనే అంత ఆసక్తికరంగా ఉండదు. మూవీ రిలీజ్ కు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్ చూసిన వారు రిలీజ్ అయ్యాక చూసి చాలా నిరాశపడ్డారు.
3. కబ్జా:
కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో, భారీ తారగణంతో తెరకెక్కింది. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే కేజిఎఫ్ సినిమాల ఉందనే విమర్శలు వచ్చాయి. రొటీన్ స్టోరీ, కేజీఎఫ్ సినిమాని పోలి ఉండడంతో ఈ మూవీ ప్లాప్ గా నిలిచింది.
4. మీటర్:
వినరో భాగ్యం విష్ణు కథ మూవీ తరువాత కిరణ్ అబ్బవరం నటించిన సినిమా మీటర్. ఈ మూవీ స్టోరీ లైన్ చాలా సింపుల్ గా ఉంటుంది. కమర్షియల్ మూవీగా వచ్చిన ఈ మూవీలో లవ్ ట్రాక్ కానీ, కామెడీ గాని అంతగా వర్కవౌట్ కాకపోవడంతో ఈ మూవీ ప్లాప్ గా నిలిచింది.
5. ఆదిపురుష్:
ప్రభాస్ రాముడిగా నటించిన ఈ మూవీ పోస్టర్ రిలీజ్ తోనే వివాదాలు, విమర్శలు మొదలయ్యాయి. పూర్ విఎఫ్ఎక్స్, పాత్రల వేషధారణ, ముఖ్యంగా హనుమంతుడితో మాస డైలాగ్స్, ఈ మూవీ మొదట్లో భారీ కలెక్షన్స్ వచ్చినా, ఆ తరువాత విమర్శలు వివాదాలతో డిజాస్టర్ గా నిలిచింది.
6. రామబాణం:
గోపీచంద్, జగపతి బాబు ప్రధానపాత్రలలో నటించిన చిత్రం రామబాణం. తీసుకున్న స్టోరీనే ఈ మూవీ ప్లాప్ కావడానికి కారణం చెప్పవచ్చు. ఎన్నో సినిమలలో చూసిన కథే కావడంతో ప్రేక్షకులకు కొత్తదనం కనిపించలేదు. 7. మైఖేల్:
సందీప్ కిషన్ నటించిన ఈ మూవీ గ్యాంగ్ స్టర్ కథతో తెరకెక్కింది. ఇలాంటి సినిమాలు ఇప్పటివరకు చాలా వచ్చాయి. కొత్తదనం లేకపోవడంతో ఈ మూవీ చూస్తున్నంతసేపు చూసినవే మళ్ళీ మళ్ళీ చూసిన ఫీలింగ్ వస్తుంది. దాంతో ఈ మూవీ కూడా ప్లాప్ గా నిలిచింది. 8. హంట్:
సుధీర్ బాబు నటించిన ఈ మూవీ మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ముంబై పోలీస్ రీమేక్ గా తెరకెక్కింది. అంత హిట్ అయిన మూవీని తెలుగులో మాత్రం మెయిన్ ట్విస్ట్ పై దృష్టి పెట్టి మిగతా స్రీన్ ప్లే ఇంట్రస్టింగ్ గా రాయలేదు. దాంతో ఈ మూవీ ప్లాప్ గా నిలిచింది.
9. మళ్ళీ పెళ్లి:
సీనియర్ నరేష్, పవిత్రా లోకేష్ జంటగా నటించిన ఈ మూవీకి ఎం ఎస్ రాజు దర్శకత్వం వహించారు. రిలీజ్ కు ముందు ఈ మూవీ గురించి చాలా చెప్పారు. కానీ రిలీజ్ అయ్యాక మూవీలో అవేం కనిపించలేదు. మూవీ కెళ్లిన ఆడియెన్స్ కి బోర్, చిరాకు తెప్పించిన సినిమాగా నిలిచి, ప్లాప్ అయ్యింది.
10. అమిగోస్:
ఈ చిత్రం కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, ఫస్ట్ పర్వలేదనిపించింది. ఊహకు తగినట్టు సాగే కథనంతో సాగేటప్పటికి, సెకండ్ హాఫ్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా లేకపోవడంతో ప్లాప్ గా నిలిచింది.
11. వీర సింహ రెడ్డి:
ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి భారీ కలెక్షన్స్ వచ్చిన కూడా సినిమాలో ఉన్నా చాలా వాటి మీద ట్రోల్స్ వచ్చాయి. హాని రోజ్ బాలకృష్ణ కి తల్లిగా చేయడం, బాలకృష్ణతో శృతి హాసన్ లవ్ స్టోరీ, తగాదాలు, కొన్ని సీన్స్ పైన విమర్శలు వచ్చాయి. 12. తెగింపు:
తమిళ స్టార్ హీరో నటించిన ఈ మూవీ పై అటు అభిమానుల్లో ఇటు ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. పోస్టర్, టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెరిగిపోయాయి. మంచి కలెక్షన్స్ సాధించినప్పటికి, ఫస్ట్ హాఫ్ బాగున్నా, సెకండ్ హాఫ్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు.
End of Article