“ఆదిపురుష్” సినిమాతో పాటు… ఈ 2023 లో వచ్చిన 9 “చెత్త” సినిమాలు..!

“ఆదిపురుష్” సినిమాతో పాటు… ఈ 2023 లో వచ్చిన 9 “చెత్త” సినిమాలు..!

by Mohana Priya

ప్రతి సంవత్సరం ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ప్రతి సినిమాకి టాక్ కూడా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులకి అలా గుర్తుంటాయి. ఇంకా కొన్ని సినిమాలు కూడా ప్రేక్షకులకి గుర్తుంటాయి.

Video Advertisement

కానీ అవి మంచి జ్ఞాపకాలుగా కాదు. అలాంటి సినిమా టీవీలో వస్తోంది అంటే ఆ ఛానల్ చుట్టుపక్కలకి కూడా వెళ్లరు. ఈ సంవత్సరం అలా థియేటర్ లో తలనొప్పి తీసుకొచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. కొన్ని సినిమాలు హిట్ అయినా కూడా అవి ఎందుకు హిట్ అయ్యాయో తెలియకుండా అయోమయం పెట్టాయి. ఇప్పుడు అలా ఈ సంవత్సరం వచ్చిన వరస్ట్ సినిమాలు ఏంటో చూద్దాం. ఇందులో హిట్ అయిన సినిమాలు, ఫ్లాప్ అయిన సినిమాలు ఉంటాయి.

#1 ఏజెంట్

ఒక సినిమా ఎన్నో సార్లు వాయిదా పడి రిలీజ్ అవుతుంది అంటేనే ఎక్కడో తేడా కొడుతోంది అని అర్థం అవుతుంది. ఈ సంవత్సరం వచ్చిన ఏజెంట్ సినిమా కూడా అంతే. చాలా సార్లు వాయిదా పడి రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలని అందుకోలేకపోయింది.

#2 ఆదిపురుష్

ఈ సినిమా గురించి రిలీజ్ అయిన తర్వాత నుండి కొన్ని నెలల వరకు చాలా మంది ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. కాబట్టి ఇప్పుడు దీని గురించి ఎంత తక్కువగా చెప్తే అంత మంచిది ఏమో.

#3 స్కంద

సినిమా ఎంత బాగుంటుందా అని కాకుండా ఎంత లాజిక్ లెస్ గా ఉంటుందా అని ఈ ఒక్క సినిమాకి మాత్రమే ఎదురు చూశారు ఏమో. అందుకే సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి సినిమాలో ఒక్కొక్క సీన్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అలా ఉన్నాయి మరి.

#4 శాకుంతలం

సమంత నటించిన ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య విడుదల అయ్యింది. అటు టెక్నికల్ గా, ఇటు కథ పరంగా ఏ రకంగా కూడా ఇది ఆసక్తికరంగా లేదు.

reasons for shaakuntalam negative talk 1

#5 వీర సింహా రెడ్డి

సినిమా హిట్ అయ్యింది. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. అదే విధంగా సినిమా మీద కామెంట్స్ కూడా వచ్చాయి. అందులోనూ ముఖ్యంగా హనీ రోజ్ బాలకృష్ణకి తల్లిగా నటించడం అనే దాని మీద ఇంకా ఎక్కువగా కామెంట్స్ వచ్చాయి.

who is the winner of this pongal..

#6 రూల్స్ రంజన్

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమా మీద కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. సమ్మోహనుడా పాట వల్ల చాలా ఫేమస్ అయ్యింది. కానీ సినిమా మాత్రం అంచనాలని అందుకోలేకపోయింది.

rules ranjann movie review

#7 వారసుడు

గత 20 సంవత్సరాలుగా వచ్చిన ఫ్యామిలీ ఓరియెంటెడ్ తెలుగు సినిమాలన్నిటినీ కలిపి మిక్సీలో వేసి తీసినట్టుగా ఉంటుంది ఈ సినిమా. ఒక్క సినిమాలో ఎన్ని సినిమాలు కనిపిస్తాయో లెక్కపెట్టుకుంటూ పోతే ఈ సినిమాలో చాలా సినిమాలు ఉంటాయి.

minus points in varisu movie trailer

#8 భోళా శంకర్

కొన్ని సినిమాలు అనౌన్స్ చేసిన తర్వాత నుండి వచ్చే ప్రతి పోస్టర్ తో సినిమా ఫ్లాప్ అవుతుంది అని అర్థం అవుతూ ఉంటాయి. సినిమాకి సంబంధించిన పాటలు, ట్రైలర్ వచ్చాక చూసి ఈ సినిమా కూడా సినిమా ఫ్లాప్ అవుతుంది అని అనుకుంటాం. మనం అనుకున్నది ఎంత వరకు కరెక్ట్ అని వెళ్లి థియేటర్ లో సినిమా చూసి అప్పుడు సినిమాని ఫ్లాప్ అని చెప్తాం. అంటే ముందు నుండి కూడా ఒక సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది. ఈ సినిమా కూడా అలాంటిదే. రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది.

#9 బ్రో

ఎవరు అడగని, అసలు ఎందుకు తీసారో తెలియని రీమేక్ సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఇది కూడా ఒకటి. సినిమా కాన్సెప్ట్ బాగున్నా కూడా చాలా విషయాల్లో నిరాశపరిచింది.

bro movie review

ఇవి మాత్రమే కాదు. రావణాసుర, రామబాణం ఇంకా చాలా సినిమాలు వచ్చాయి. ఈ సంవత్సరం హిట్ సినిమాల కంటే ఫ్లాప్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ హిట్ అయినా కూడా అందులో ట్రోల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అందుకే ఈ లిస్ట్ చెప్తూ వెళ్తే పెద్దగానే ఉంటుంది.

ALSO READ : “సలార్” కంటే ముందు… “పృథ్వీరాజ్ సుకుమారన్” నటించిన మొదటి తెలుగు సినిమా ఏదో తెలుసా..?


You may also like

Leave a Comment