Ads
సముద్రం నేపథ్యం .. జాలరుల జీవన విధానానికి అద్దం పడుతూ గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. జాలరుల జీవితాలతో ముడిపడిన ప్రేమకథగా ఇటీవల వచ్చిన ‘ఉప్పెన’ కూడా సంచలన విజయాన్ని సాధించింది. అలా సముద్రాన్ని నమ్ముకున్న జీవితాల చుట్టూ తిరిగే కథగా ప్రేక్షకులను పలకరించింది ‘జెట్టి’ మూవీ.
Video Advertisement
మన్యం కృష్ణ – నందిత శ్వేత జంటగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడి పాత్రను మైమ్ గోపి పోషించాడు. వేణుమాధవ్ నిర్మించిన ఈ సినిమాకి సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వం వహించాడు.
ఈ నేపథ్యం లో ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ” ఇప్పుడే జెట్టి సినిమా చూసా..కొత్త దర్శకుడు సుబ్రహ్మణ్యం పిచ్చుక చాల బాగా తీశారు. కమర్షియల్ అంశాలు స్పృశిస్తూనే.. మంచి పాయింట్ ని ప్రజలకు చేరువ చేసారు. ముఖ్యం గా ఇందులో నటించిన వారిలో ఎక్కువ శాతం స్టేజి ఆర్టిస్టులే కావడం విశేషం. వారందరి ప్రయత్నాన్ని అభినందిస్తూ .. ప్రతి ఒక్కరు ఈ సినిమాకు వెళ్ళండి.” అని ఆయన ఒక వీడియో లో మాట్లాడారు.
జెట్టి అంటే సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్రాన్ని కలిపే వంతెన. కోస్తాంధ్రలోని మత్స్యకారుల సమస్యను ఆధారంగా చేసుకొని దర్శకుడు సుబ్రహ్మణ్యం పిచ్చుక రాసుకొన్న పాయింట్ బాగుంది. నేటివిటి, గ్రామానికి సంబంధించిన మట్టివాసన కథలో గుభాలిస్తుంది. గ్రామీణ ప్రజల్లో అమాయకత్వం పాత్రల్లో ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది.
watch video:
End of Article