YAKSHINI REVIEW : వేదిక, లక్ష్మీ మంచు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఆకట్టుకుందా..?

YAKSHINI REVIEW : వేదిక, లక్ష్మీ మంచు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఆకట్టుకుందా..?

by Mohana Priya

Ads

వేదిక, మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన యక్షిణి ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ వెబ్ సిరీస్ కి తేజ మర్ని దర్శకత్వం వహించారు. శోభ యార్లగడ్డ. ప్రసాద్ దేవినేని ఈ వెబ్ సిరీస్ నిర్మించారు. ప్రియదర్శన్ సుబ్రమణియన్ సంగీతం అందించారు. రాహుల్ విజయ్, అజయ్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, యక్షులను బానిసగా చేసుకోవాలి అని మహాకాళ్ (అజయ్), ప్రేమ అనే పేరుతో యక్షిణి అయిన మాయ (వేదిక) ని ప్రేమించి తర్వాత మోసం చేస్తాడు. కుబేరుడు మాయని మానవ ప్రేమకి లొంగినందుకు, భూలోకంలో ఉండాలి అని, ఆ శాపం నుండి విముక్తి కలగాలి అంటే, 100 మంది బ్రహ్మచారులను ప్రేమ పేరుతో మోసం చేసి చం-పా-ల-ని చెప్తారు.

Video Advertisement

yakshini review telugu

99 మందిని చం-పి-న మాయ 100వ వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటుంది. ఆ సమయంలోనే కృష్ణ (రాహుల్ విజయ్) మాయని కలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. సోషియో ఫాంటసీ అనే అంశం మీద చాలా సిరీస్, సినిమాలు వస్తున్నాయి. ఈ సిరీస్ కూడా అలాగే వచ్చింది. స్టోరీ పాయింట్ బాగుంది. కానీ టేకింగ్ విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. కొన్ని చోట్ల చాలా కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, వేదిక చూడడానికి బాగున్నారు. ఆమె పాత్ర కూడా బాగుంది. లక్ష్మీ మంచు జ్వాలాముఖి అనే మరొక యక్షిణి పాత్రలో నటించారు. లక్ష్మీ మంచు నటన కూడా బాగుంది. మిగిలిన వాళ్లు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు.

మొదట ఇంట్రెస్టింగ్ గా మొదలు అవుతుంది. ఆ తర్వాత వెళ్తున్న కొద్ది మాత్రం ఎటు వెళ్తోంది అనేది అర్థం కాదు. మొదటి రెండు ఎపిసోడ్ల తర్వాత సిరీస్ ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది. ఏదో చేయాలి అనుకుని ఏదో చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. క్లారిటీ మిస్ అయ్యింది. రాహుల్ విజయ్ కుటుంబానికి సంబంధించిన సీన్స్ ఒక ఫ్లోలో కాకుండా మధ్యలో యాడ్ చేసినట్టు అనిపిస్తాయి. కథని డివియేట్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. కామెడీ కొన్ని చోట్ల బాగుంది. కొన్ని సీన్స్ లాజిక్ కి దూరంగా ఉంటాయి. ఆరు ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. తెలుగుతో పాటు, తమిళ్ లో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి ఈ రెండు భాషల్లో మాత్రమే ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది.


End of Article

You may also like