Ads
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే ముందు నుంచి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఎన్నికల్లో చాలామంది సీనియర్లకు పరాభవం తప్పలేదు. చాలామంది కొత్తవారు యువత ఎమ్మెల్యేలు అయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తిలో ఓడిపోయారు.ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని నేతగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును 26 ఏళ్ల యశస్విని రెడ్డి ఓడించారు.
Video Advertisement
Popular News: బర్రెలక్కకు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా..?
Errabelli Dayakar Rao
యశస్విని రెడ్డి వయసు 26 ఏళ్లు.. రాజకీయంగా ఎలాంటి అనుభవం లేదు.. అనూహ్యంగా తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి విజయాన్ని అందుకున్నారు. యశస్విని రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జన్మించారు.. హైదరాబాద్‌లో చదువుకున్నారు. వివాహం అనంతరం అమెరికా వెళ్లి అక్కడ వ్యాపార బాధ్యతల్ని చూసుకుంటున్నారు. యశస్విని అత్త హనుమాండ్ల ఝాన్సీరెడ్డిది పాలకుర్తి నియోజకవర్గం. ఝాన్సీ కుటుంబం అమెరికాలో స్థిరాస్తి వ్యాపారం ఉంది. ఆమె పాలకుర్తి సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ధార్మిక, సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి పాలకుర్తి టికెట్ కోసం ప్రయత్నించారు.
Popular News: TELANGANA NEW CABINET MINISTERS LIST 2024
Telangana Elections results 2023
ఝాన్సీరెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఖాయమైంది.. అయితే ఆమెకు భారత పౌరసత్వం విషయంలో చిక్కులు వచ్చాయి. దీంతో అనూహ్యంగా కాంగ్రెస్ వ్యూహం మార్చేసింది.ఝాన్సీకి బదులుగా ఆమె కోడలు యశస్విని రెడ్డికి పాలకుర్తి టికెట్ ఖాయం చేసింది. ఆమె అనూహ్యంగా తన అత్త బదులుగా పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. తెలంగాణ ఎన్నికల్లో సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుపై అనుభవం లేని యశస్విని పోటీ చేస్తుంది నెగ్గె ఛాన్స్ లేదు అని అన్నారు.
Yashaswini Reddy Congress Leader
అంతేకాదు ఆమె ప్రచారంలో కాస్త తడబడ్డారు.. జై కాంగ్రెస్ అనబోయి జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు అవాక్కయ్యారు. యశస్విని రెడ్డి గెలుస్తారా అంటూ కొందరు నవ్వుకున్నారు. కానీ అనూహ్యంగా పాలకుర్తిలో యశస్విని రెడ్డి విజయం సాధించి.. ఎర్రబెల్లికి షాకిచ్చారు. ఎర్రబెల్లి రాజకీయ అనుభవం అంత వయసు లేని యశస్విని రెడ్డి ఆయననే ఓడించి రికార్డు సృష్టించారు.
End of Article