హీరోయిన్ సమంత లీడ్ రోల్ పోషించిన ‘యశోద’ మూవీ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా ఏకంగా ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. ఈ సినిమాని హరి- హరీష్ దర్శకత్వంలో సరోగసి బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించారు.

Video Advertisement

‘ఓ బేబీ’ తర్వాత సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా తెలుగు రాష్ట్రాల్లో సమంతకి థియేటర్ల వద్ద అభిమానులు పెద్ద ఎత్తున కటౌట్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం.

minus points in samantha yashoda movie

శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో సమంతతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటించారు. రిలీజైన ప్రతి చోట ఈ చిత్రానికి పాజిటీవ్‌ రివ్యూలు వస్తున్నాయి. యశోద కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందని.. అలానే యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్, బీజీఎం చాలా బాగా కుదిరాయి. చాలా గ్యాప్ తర్వాత సమంత ఫుల్ లెంగ్త్ సినిమాతో వచ్చింది. ‘యశోద’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకులని ఫిదా చేసేసింది. యశోద సినిమా పాన్ ఇండియా వైడ్ నవంబర్ 11న విడుదల అయ్యింది.

minus points in samantha yashoda movie

సమంత ఇంతకు ముందు చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌కు డిఫరెంట్ అని చెప్పాలి. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌తో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. ఇక ఈ సినిమా ఓటీటీ లో ఎప్పుడు వస్తుంది అనేది చూస్తే… ఓటీటీ ప్లాట్ ఫామ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా రైట్స్ ని తీసుకుంది. డిసెంబర్ సెకండ్ వీక్ న ఈ సినిమా రావచ్చట. డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. అఫీషియల్ గా అయితే సమాచారం లేదు.