Ads
తెలుగు సినిమా అంటే ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు, నాగేశ్వర రావు, కృష్ణ, శోభన్ బాబు. తరువాత కాలంలో చిరు, వెంకీ, బాలయ్య, నాగ్ . ప్రస్తుత మన తరానికి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒక రేంజ్ స్టార్ డమ్ అందుకున్న హీరోలు.
Video Advertisement
అయితే సినిమాల్లో మంచి కంటెంట్ ఉన్న కొత్త తారలను కూడా ప్రేక్షకులు స్వాగతిస్తారు. విభిన్నమైన కంటెంట్ తో, తక్కువ బడ్జెట్ సినిమాలు తీస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు కొందరు హీరోలు. మరి తర్వాతి తరానికి స్టార్ హీరోలు అయ్యే అవకాశాలు ఉన్న నటులు ఎవరో చూద్దాం..
#1 రానా దగ్గుబాటి
రానా పరిశ్రమలో అడుగు పెట్టి పదేళ్లకు పైగా కాలం గడిచింది. స్టార్ డం సంగతి పక్కన పెడితే విభిన్నమైన చిత్రాలను రానున్న కాలం లో మరిన్ని తీస్తాడు రానా.
#2 నాని
సెన్సిబుల్ స్టోరీస్ ఎంచుకోవడం లో నాని కి తిరుగులేదు. ఇప్పటికే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నాని భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి చేరువవుతాడు.
#3 నవీన్ పోలిశెట్టి
ఇంతకు ముందు సినిమాల్లో చిన్న చిన్న పత్రాలు వేసిన నవీన్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రం తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. విభిన్న కథలు ఎంచుకుంటున్న నవీన్ ఒక గొప్ప నటుడు అని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు.
#4 నాగ శౌర్య
స్టార్ హీరో కి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్న నాగ శౌర్య మంచి కథలు ఎంచుకుంటే భవిష్యత్తులో స్టార్ కాగలడు.
#5 వరుణ్ తేజ్
సినిమా సినిమా కి తనను మెరుగు పరుచుకుంటున్న హీరో వరుణ్ తేజ్. భవిష్యత్తులో మంచి చిత్రాలు ఇతని నుంచి ఆశించవచ్చు.
#6 విజయ్ దేవరకొండ
పెళ్లి చూపులు చిత్రం తో సైలెంట్ హిట్ కొట్టిన విజయ్ అర్జున్ రెడ్డి తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. మంచి స్టోరీస్ తీసుకుంటే విజయ్ కి తిరుగుండదు.
#7 నిఖిల్ సిద్దార్థ్
హ్యాపీ డేస్ చిత్రం తో ఎంట్రీ ఇచ్చిన నిఖిల్.. చాల ప్లాప్ సినిమాలు తీసిన తర్వాత సూపర్ హిట్ లు అందుకుంటున్నాడు. ఇలానే భవిష్యత్తులో కొనసాగితే స్టార్ హీరో అవుతాడు.
#8 అడివి శేష్
కెరీర్ స్టార్టింగ్ నుంచి విలక్షణ కథలు ఎంచుకుంటున్న శేష్.. దర్శకుడు కూడా. ప్రస్తుతం తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు.
#9 సాయిధరమ్ తేజ్
తన ఎనర్జీ తో ప్రేక్షకులను ఆకట్టుకొనే సాయి ధరమ్ తేజ్ కూడా భవిష్యత్ సూపర్ స్టార్ అయ్యే అవకాశాలున్నాయి.
#10 రామ్ పోతినేని
హీరోగా ఇప్పటికే తనని తాను నిరూపించుకున్న రామ్ చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇలాగె కొనసాగితే ఇండస్ట్రీ కి ఎనర్జిటిక్ స్టార్ హీరో దొరికినట్లే.
#11 సత్యదేవ్
చిన్న చిన్న పాత్రలు వేస్తూ మంచి నటుడిగా నిరూపించుకున్న సత్య దేవ్ మంచి కథలు ఎంచుకుంటే సూపర్ స్టార్ అవుతాడనడం లో సందేహం లేదు.
#12 విశ్వక్ సేన్
మంచి కథ తన దగ్గరకు రావాలే కానీ తనలోని నటుడుని అందరికి చూపిస్తాడు విశ్వక్ సేన్.
#13 నాగ చైతన్య
కెరీర్ లో పెద్ద హిట్స్ లేవు కానీ స్టార్ హీరో అయ్యే అన్ని లక్షణాలు నాగ చైతన్య లో పుష్కలం గాఉన్నాయి.
#14 శర్వానంద్
మంచి నటుడిగా ప్రేక్షకులు శర్వానంద్ ని ఎప్పుడో గుర్తించారు కానీ సరైన హిట్ పడితే శర్వా సూపర్ స్టార్ అవుతాడు.
#15 తేజ సజ్జ
బాలనటుడిగా అందరికి పరిచయం అయిన తేజ జాంబీ రెడ్డి తో హీరో గా మారాడు. ముందు నుంచే విలక్షణమైన కథలు ఎంచుకుంటున్నాడు తేజ సజ్జ. ఇలాగె కొనసాగితే స్టార్ హీరోగా మారే అవకాశం లేకపోలేదు.
End of Article