మహేష్ బాబు తన తండ్రిని కోల్పోవడంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. తన తండ్రి మరణంతో షూటింగ్స్ కూడా ఆలస్యం అయ్యే లాగే వున్నాయి. మహేష్ బాబు తల్లి తండ్రి ఇద్దరు దూరమవడంతో మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. దీనితో ఆయన మూవీస్ కూడా ఆలస్యం అయ్యే లాగే ఉన్నాయి.

Video Advertisement

ఏది ఏమైనా మహేష్ బాబు కి దీని నుండి బయటకి రావడానికి సమయం పడుతుంది. సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరవాత రాజమౌళి తో మహేష్ ఓ సినిమా చేస్తున్నారు.

త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. హారిక హాసిని బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలానే రెండో హీరోయిన్ కింద శ్రీ లీల నటిస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలను మనం చూసుకున్నట్లయితే సెకండ్ హీరో కూడా ఉంటాడు. ఈ సినిమాలో కూడా రెండవ హీరో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఎలా అయితే త్రివిక్రమ్ చేసిన గత సినిమాల్లో ఉన్నారో…. మహేష్ బాబు సినిమాలో కూడా ఇంకో హీరో ఉంటున్నట్లు తెలుస్తోంది.

సాయి రోనాక్ మహేష్ బాబు సినిమాలో సెకండ్ హీరో కింద నటిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో నటించారు సాయి రోనాక్. అలానే ప్రెషర్ కుక్కర్, పాఠశాల, గుప్పెడంత మనసు వంటి సినిమాల్లో నటించారు. అయితే సాయి రోనాక్ రాజయోగం ప్రమోషన్స్ లో బాగా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా లో ఒక పాత్ర చేస్తున్నానని చెప్పారు. దీనితో ఈ సినిమా లో రెండవ హీరో సాయి రోనాక్ ఏ అని తెలుస్తోంది. దానికి సంబంధించిన వీడియో కూడా ఇక్కడ ఉంది మరి మీరు కూడా ఒక లుక్ వేసేయండి.