లాక్‌డౌన్‌లో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి ప్రజాప్రతినిధి భాగస్వామి కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కొందరు ప్రజాప్రతినిధులు గ్రామాల సరిహద్దుల్లో కాపలా బాధ్యతలను భుజాలకెత్తుకొన్నారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని మదపురం సర్పంచ్‌ ఉడుత అఖిల ఊరి సరిహద్దులో బందోబస్తుగా ఉన్నారు. అత్యవసర వాహనాలనే అనుమతించారు. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Video Advertisement

తమ గ్రామంలోకి ఎవరూ రాకుండా ముళ్ల కంచెలు వేసి కాపు కాస్తున్న సర్పంచ్ ఉడుత అఖిల యాదవ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచె వేసి గ్రామంలోకి ఎవరూ రాకుండా, గ్రామం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా కాపు కాసారు. ముఖానికి అడ్డుగా వస్త్రం కట్టుకుని.. కర్ర చేతపట్టుకొని నిల్చున్న ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.లంగాణలోనే అతిపిన్న వయస్కురాలైన సర్పంచ్‌గా ఉడుత అఖిల యాదవ్‌కు రికార్డులకెక్కారు. ‘మా ఊరికి మీరు రావొద్దు.. మీ ఊరికి మేము రాము’ అంటూ కొత్త నినాదాన్ని అందిపుచ్చుకున్నారు.

watch video: