Ads
ప్రజలు ఇది వరకు యూట్యూబ్ ని చూసే దానికి.. ఇప్పుడు యూట్యూబ్ ని చూసే దానికి చాలా మార్పులు వచ్చాయి. అయితే మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా.. యూట్యూబ్ కూడా రకరకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రస్తుతం ఎన్నో కుటుంబాలకు యూట్యూబ్ ఆదాయవనరుగా మారింది. టాలెంట్ ఉండి.. అవకాశాల కోసం ఎదురు చూసేవారికి యూట్యూబ్ మంచి ఫ్లాట్‌ఫామ్‌గా మారింది.
Video Advertisement
మనం ఏది నేర్చుకోవాలన్నా యూట్యూబే దిక్కు అన్నట్లుగా పరిస్థితి మారింది. ప్రతి అంశానికి సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. కొన్నేళ్లుగా.. చాలా మంది సొంతంగా చానెల్స్ క్రియేట్ చేసుకుని.. వీడియోలు అప్‌లోడ్ చేస్తూ.. ఆదాయం ఆర్జిస్తున్నారు. యూట్యూబ్ ద్వారా ఏడాదికి కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నవారు కూడా ఉన్నారు.
అయితే కరోనా సమయం లో సామాన్యుల నుంచి సెలెబ్రెటీల వరకు యూట్యూబ్ చానెల్స్ ఏర్పాటు చేసుకొని ఆదాయం పొందుతున్నారు. లాక్‌డౌన్ తర్వాత సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో చాలా మంది సెలబ్రిటీలకు తీరిక దొరకడం ఒక ఎత్తయితే.. ఆదాయం వనరులు మూసుకుపోయినట్లు అయ్యింది. దాంతో వారి చూపు యూట్యూబ్ మీద పడింది. ప్రస్తుతం బుల్లితెర, బిగ్ స్క్రీన్, యాంకర్లు, ఇలా వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు యూట్యూబ్ చానెల్స్ ప్రారంభించి.. వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు.
వారి అభిమానులు కూడా వారిని అలాగే ఆదరిస్తున్నారు. అయితే వీరంతా యూట్యూబ్‌లోకి ఎంటరయిన కొత్తలో వారి వ్యక్తిగత విషయాలు, హోమ్ టూర్‌లు, ఫ్రిడ్జ్ టూర్‌లు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసేవారు. కానీ ప్రస్తుతం ఆ ట్రెండ్ మారింది. షాపింగ్ వీడియోలు పెడుతున్నారు. కారు, బంగారం, ఇల్లు కొన్నాం అంటూ వరుసగా షాపింగ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం బిగ్‌బాస్ ఫేం హిమజ.. బీఎండబ్ల్యూ కార్ కొన్నాను అంటూ వీడియో అప్‌లోడ్ చేసింది. కారు ధర, ఫీచర్లు ఇలా అన్ని వివరాలు చెప్పుకొస్తూ.. ఆఖర్లో భారీ షాకిచ్చింది. తాను కారు కొనడం.. దాని ఫీచర్లను ఎక్స్‌ప్లేయిన్ చేయడం కల అంటూ చెప్పుకొచ్చింది.
ఈ వీడియో చూసిన తర్వాత సోషల్ మీడియాలో.. సెలబ్రిటీలు పోస్ట్ చేసే షాపింగ్ వీడియోల మీద చర్చ మొదలయ్యింది. దీని ప్రకారం చూస్తే.. కొందరు సెలబ్రిటీలు.. నెలలో 4-5 షాపింగ్ వీడియోలు పోస్ట్ చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సెలెబ్రెటీలు ఆయా బ్రాండ్స్, షాపుల వాళ్ళకి ప్రొమోషన్స్ చేసి జనాలను పిచ్చి వాళ్ళను చేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
End of Article