Ads
చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత భీమ్లా నాయక్ థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా ఆలస్యం అయ్యింది.
Video Advertisement
చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత భీమ్లా నాయక్ థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా ఆలస్యం అయ్యింది.
సినిమా రీమేక్ అనే విషయం తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉండటంతో, అది కూడా రానా దగ్గుబాటితో మల్టీస్టారర్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమాలో హీరోల పాత్రలతో పాటు.. ఇతర పాత్రలకు కూడా ప్రాముఖ్యత లభించింది. వాటిల్లో లేడీ కానిస్టేబుల్ పాత్ర కూడా ఉంది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎస్సై గా నటించారు. ఆయన స్టేషన్ లోనే లేడీ కాన్స్టేబుల్ గా మౌనిక నటించారు. మౌనిక చాలా మందికి ఎక్కడో చూసినట్లే అనిపిస్తోంది కదా. ఆమె సూర్య వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయ్యారు. యూట్యూబ్ లో ఆమె నటించిన షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లు కూడా కనిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమాలో ఆమె పాత్ర చిన్నదే అయినా.. పవన్ తో పాటు కలిసి నటించడం విశేషం.
పవన్ తో పాటు, ఆమె కూడా ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఆ సమయంలో పవన్-మౌనిక ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. యూట్యూబ్ లో బాగా పాపులర్ అయిన “సూర్య” వెబ్ సిరీస్ తో మౌనిక తెలుగు యూత్ కి బాగా దగ్గరయ్యారు. మంచి నటన తో భీమ్లానాయక్ మూవీ లో కూడా అలరించారు. ఆమె నటించిన సిరీస్ లు, వీడియోస్, ఆమె ప్రతిభే ఆమెకి ఇంతటి అవకాశాన్ని తెప్పిచ్చాయి. మరిన్ని సినిమాలతో ప్రేక్షకులని అలరించాలని, సక్సెస్ తో ఆమె ముందుకెళ్లాలని కోరుకుందాం.
End of Article