Home Filmy Adda యాంకర్ ప్రదీప్ ని పెళ్లి చేసుకుంటానంది.. కానీ చిన్నవయసులోనే కన్నుమూసిన నటి.. ఏమి జరిగిందంటే..?

యాంకర్ ప్రదీప్ ని పెళ్లి చేసుకుంటానంది.. కానీ చిన్నవయసులోనే కన్నుమూసిన నటి.. ఏమి జరిగిందంటే..?

by Anudeep

Ads

నటి, యూట్యూబర్ శ్రియ మురళీధర్ సోమవారం రాత్రి మరణించారు. గుండెపోటు కారణంగా ఆమె హఠాన్మరణం చెందారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించాలని భావించారు. కానీ.. మార్గం మధ్యలోనే ఆమె తుదిశ్వాస విడిచారు.

Video Advertisement

సోమవారం రాత్రి సమయంలో నటి శ్రియ మురళీధర్ గుండెపోటుకు గురయ్యారు. ఆమె వయసు 27 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులో ఆమె కార్డియాక్ అరెస్ట్ కు గురికావడం అభిమానులని షాక్ కి గురి చేస్తోంది.

Also Read: ఆమె భర్త ఆర్మీ జవాన్.. మరొకరితో ఎఫైర్ పెట్టుకుంది.. ఇంతలో హఠాత్తుగా హత్య చేయబడింది.. అసలేం జరిగిందంటే..?

shreya 1

ఆమె కన్నుమూయడంతో.. ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. గతంలో యాంకర్ ప్రదీప్ నిర్వహించిన ‘పెళ్లి చూపులు’ రియాలిటీ షో కి శ్రియ మురళీధర్ కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆమె పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.

shreya 2

హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ కు చెందిన శ్రియ పాపులర్ యూట్యూబర్ కూడా. ఆమె “వాట్ ది ఫన్” అనే ఛానెల్ లో పలు వీడియోస్ కూడా చేసారు. వీటితో ఆమె మరింత పాపులర్ అయ్యారు. బిగ్ స్క్రీన్ పై కూడా రాణించాలని ఆమె కలలు కన్నారు. కానీ, ఆమె అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆమె మృతి పై దీప్తీ సునయన, సురేఖ కుమార్తె సుప్రీతా తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

Also Read: ముందు చక్రాలకంటే “ట్రాక్టర్” కి వెనక చక్రాలు ఎందుకు పెద్దగా ఉంటాయో తెలుసా.?


End of Article

You may also like