వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. దేశంలోనే యంగెస్ట్ సీఎం. వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు.

Video Advertisement

దేశంలో ఉన్న మాస్ పొలిటికల్ లీడర్స్ లో జగన్ ఒకరు. పట్టుదల కి మొండితనానికి జగన్మోహన్ రెడ్డి పెట్టింది పేరు. అనుకున్నది చేసేదాకా వదిలిపెట్టరు.

మొదటిసారి కడప నుండి ఎంపీగా ఎన్నికైనప్పుడు రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించారు. తర్వాత వైసిపి పార్టీలో ఎంపీగా ఎన్నికైనప్పుడు దేశంలోని ఎవ్వరికీ అందనంత ఎత్తులో 5 లక్షల పైగా మెజార్టీ సాధించి చరిత్ర సృష్టించారు. నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా తన పేరును లిఖించుకున్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ విషయానికి వస్తే. ఈయన భార్య పేరు వైయస్ భారతి రెడ్డి. ఏమి కూడా రాష్ట్రంలో అందరికీ తెలిసిన వ్యక్తి. వైయస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు ముందుండి పార్టీని నడిపించిన వ్యక్తుల్లో ఈమె ఒకరు. సాక్షి గ్రూప్ కి చైర్మన్. ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డిల వివాహం లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ కథనం మీకోసం.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మెడిసిన్ చదువుకునేటప్పుడు ఆయనకు సుగుణ రెడ్డి అనే స్నేహితురాలు ఉండేవారు. సుగుణ రెడ్డి కుమార్తె భారతి రెడ్డి. ఈమెను జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేయాలని ఇరువురు అనుకున్నారు. అలా మొదటిసారి భారతి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడే ఒకరికి ఒకరు నచ్చేసారు.

ys jagan mohan reddy wedding card going viral

వీళ్ళ లవ్ స్టోరీ 1996 సంవత్సరంలో స్టార్ట్ అయింది. అదే సంవత్సరం ఆగస్టు 28న వీరి వివాహం అయింది. పెళ్లి సమయానికి జగన్మోహన్ రెడ్డి వయసు కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. వీరిద్దరి ప్రేమకి ప్రతిరూపంగా ఇద్దరు కుమార్తెలు జన్మించారు. వారే హర్ష రెడ్డి, వర్ష రెడ్డి. వీరిద్దరూ కూడా లండన్ లో ఉన్నత చదువులు చదువుతున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి భారతి రెడ్డిల దాంపత్యాన్ని చూసిన ఎవరైనా కూడా ఇలా ఉండాలి కదా అని అనుకోక మానరు.

Also Read: పవన్ కళ్యాణ్ సినిమా నాకు నచ్చలేదు: రేణు దేశాయ్