Ads
ఏపీ లో బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి.గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణాణం లో మాట్లాడుతూ..తమ పాలన చేపట్టిన తర్వాత సగర్వంగా మాట్లాడుతున్నామని సీఎం జగన్ ప్రసంగం మొదలు పెట్టారు.కొవిడ్ బాధితులకి కొద్దిసేపు మౌనం పాటించిన అసెంబ్లీ అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు.ప్రాణం విలువ నాకు తెలుసు అధ్యక్షా.
Video Advertisement
దివంగత మహానేత వైఎస్సార్ చనిపోయిన సమయంలో ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిసి వారి కోసం ఏ రాజకీయ నేత చేయని విధంగా ఓదార్పు యాత్ర చేశాను. వారికి తోడుగా ఉండాలని నిర్ణయించుకుని ప్రతి కుటుంబాన్ని పరామర్శించాను. ప్రాణం విలువ తెలుసు కాబట్టే,ఆరోగ్యశ్రీని సమూలంగా మార్పులు చేశాం. ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ అందుబాటులోకి రావాలని, ఆరోగ్యశ్రీ నామమాత్రంగా ఉండకుండా, ప్రాణంపోసే పథకంలా ఉండాలని ఆకాంక్షించాం.వార్షిక ఆదాయం 5 లక్షలు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీని వర్తింపచేశామని గుర్తుచేశారు.తాము అధికారంలోకి రాకముందు 1000 రకాల చికిత్సలకే పరిమితి ఉండగా ఇప్పుడు వాటిని 2400 జబ్బులకి చేర్చమని గుర్తు చేసారు.1180 అంబులెన్సులు కొని వాటిని ప్రతి మండలానికి అందచేసినట్టు కూడా చెప్పారు.త్వరలో వైస్సార్ క్లినిక్లని తీసుకువస్తున్నట్టుగా ప్రకటించారు.
also read : సీఎం జగన్ కి నారా లోకేష్ సూటి ప్రశ్న!
End of Article