Ads
దర్శకుడు మణిరత్నం చిత్రాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. తెర పైన అద్భుత దృశ్య కావ్యాలు తెరకెక్కించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయన తీసిన సినిమాల్లో యువ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో సిద్దార్థ్, త్రిష జంటగా నటించారు. మాధవన్ ఒక కీలక పాత్రలో నటించారు. ఇక హీరో సూర్య కూడా ఈ మూవీ లో స్టూడెంట్ లీడర్ గా నటించి మెప్పించారు.
Video Advertisement
అయితే ఈ మూవీ లో ఒక స్టార్ హీరో కూడా సైడ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆయన ఎవరో కాదు కార్తీ. కార్తీ ఈ మూవీ లో కొన్ని సన్నివేశాల్లో నటించారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఆ తరువాత అమెరికాలో ఎమ్.ఎస్ చేశారు కార్తీ. అప్పట్లో కొంచెం లావుగా ఉండేవాడు కార్తీ. ఎమ్.ఎస్ పూర్తి చేసిన తర్వాత కార్తీ మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ సమయం లోనే ‘యువ’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ.. కొన్ని సన్నివేశాల్లో నటించారు.
దాని తర్వాత మూడేళ్లకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కార్తీ. తమిళం నుంచి వచ్చి తెలుగు లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోలలో కార్తి కూడా ఒకరు.ఆయన నటించే ప్రతి సినిమా తెలుగు లో విడుదల అవుతూనే ఉంటుంది.తన అన్న సూర్య పాపులారిటి తో మొదట ఎంట్రీ ఈజీ అయినప్పటికి ఆ తర్వాత తన ప్రతిభ తోనే ఒక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. యుగానికి ఒక్కడు అనే డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కార్తీ సుపరిచితమయ్యారు.
తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న కార్తీ ఆ సినిమా తరువాత నా పేరు శివ, ఆవారా సినిమాలతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.2007 లో హీరో గా మారిన కార్తి ఇప్పటి వరకు 23 సినిమాల వరకు నటించాడు.తీసే ప్రతి చిత్రంలో ఒక విభిన్నమైన కథ, కథనం ఉండాలి అని కోరుకునే హీరోల్లో కార్తి కూడా ఉంటాడు. కార్తి నటించిన సినిమాలను చూస్తే ఖచ్చితంగా మంచి టేస్ట్ ఉన్న హీరో అని మనకి తెలుస్తుంది.
ఇక ఖైదీ అనే చిత్రం కూడా కార్తి ని నటుడిగా మరొక మెట్టు ఎక్కించింది.ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది సినిమా ఇలా కూడా తీస్తారా అని ఫీల్ అయ్యారు. ఈ చిత్రం లో అద్భుతంగా నటించారు కార్తీ. ఇటీవల వచ్చిన విరుమన్, పొన్నియన్ సెల్వన్, సర్దార్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు కార్తీ. ఇక కార్తీ ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ 2 , సర్దార్ 2 , పార్టీ, జపాన్ చిత్రాలతో బిజీ గా ఉన్నాడు.
End of Article