జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న కమెడియన్ లలో ఆర్పి కూడా ఒకరు. జబర్దస్త్ లో ఆర్ పి స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తాయి.

Video Advertisement

అయితే నాగబాబు జబర్దస్త్ షో కు దూరం అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆర్పి కూడా ఈ షో కు దూరం కావడం అందరికీ తెలిసిందే.

దీని తర్వాత అదిరింది షో లో కొంతకాలం స్కిట్ లు చేసిన ఆర్ పి ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ ప్రోగ్రాంలో చేస్తున్నారు. జబర్దస్త్ మరియు ఇతర టీవీ షోలతో పోల్చిచూస్తే రెట్టింపు పారితోషికం దక్కుతుండడంతో ఈ షో మీద ఇతర స్టార్ కమెడియన్స్ కూడా ఆసక్తి కనబరచడం మనం చూస్తూనే ఉన్నాం.

అలాంటి ప్రముఖ కమెడియన్ ఓ ఇంటివాడు అయ్యారని తెలుస్తోంది. కిరాక్ ఆర్పి గా పేరు తెచ్చుకున్న ఈయన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆర్ పి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు లక్ష్మీ ప్రసన్న అని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు అని సమాచారం.

అయితే నిశ్చితార్థ వేడుకకు పలువురు ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ లు, ఆర్పీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరు అయ్యారని తెలుస్తోంది. కిరాక్ ఆర్పి జోడిని చూడటానికి చాలా చూడముచ్చటగా ఉన్నారని కామెంట్లు వస్తున్నాయి. అయితే పెళ్లికి సంబంధించి త్వరలో క్లారిటీ రానుందని తెలుస్తోంది. అయితే ఈ వేడుక హైదరాబాద్ లోని ప్రముఖ ఫంక్షన్ హాల్ లో జరిగినట్టు తెలుస్తోంది.