నీకు సెల్యూట్ బాస్.. ఓ చిన్నారి కోసం జొమాటో ఏజెంట్ సాహసం.. ఏం చేసాడంటే..!?

నీకు సెల్యూట్ బాస్.. ఓ చిన్నారి కోసం జొమాటో ఏజెంట్ సాహసం.. ఏం చేసాడంటే..!?

by Anudeep

Ads

కంప్యూటర్ యుగంలో అన్నీ రెడీమేడ్ గా లభిస్తున్నాయి. వేసుకునే దుస్తులు మొదలుకొని, తినే ఫుడ్ వరకు అన్నీ ఆన్లైన్ ఆర్డర్లే. ఒక్క బటన్ నొక్కితే చాలు అన్ని గుమ్మం ముందుకు వస్తాయి. దీంతో ఈ మధ్య ఫుడ్ డెలివరీ సర్వీసెస్ కూడా బాగా డెవలప్ అయ్యాయి. అనేక కొత్త కొత్త సంస్థలు ఈ బిసినెస్ లోకి వచ్చి వీలైనంత త్వరగా ఆర్డర్లు కస్టమర్స్ కి అందిస్తున్నాయి.

Video Advertisement

నిరుద్యోగ యువతకు కూడా ఈ డెలివరీ సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. అయితే డెలివరీ బాయ్స్ ఫుడ్ ఇచ్చామా, వచ్చామా అన్నట్టు కాకుండా అనేక సందర్భాల్లో మానవతా ధృక్పధాన్ని కనబర్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. అలాంటి సంఘటనే ఇటీవల చోటు చేసుకుంది. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసిన విషయం అందరికీ తెలిసిందే..


అయితే కేరళ కొచ్చికి చెందిన జొమాటో డెలివరీ బాయ్ జితిన్ కి అర్థరాత్రి ఓ ఫుడ్ ఆర్డర్ రాగా.. వర్షంలో 12కిమీ వెళ్లి డెలివరీ ఇచ్చాడు. ఆర్డర్ చేసిన మహిళ ఏడాది వయసున్న చిన్నారితో ఉండగా.. ఆ చిన్నారి జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న జితిన్ మరో 10 కిమీ వర్షంలోనే వెళ్లి చిన్నారికి మందులు తీసుకొచ్చాడు. జితిన్ చేసిన పనికి జొమాటో సంస్థ ప్రశంసించి, గ్యాలంట్రీ పురస్కారంతో సత్కరించింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు “శభాష్ జితిన్” అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

 


End of Article

You may also like