ఈ 7 చిట్కాలు పాటించండి…మీ ఒంట్లో యాంటీబాడీస్ పెంచుకోండి.! కరోనా నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.!

ఈ 7 చిట్కాలు పాటించండి…మీ ఒంట్లో యాంటీబాడీస్ పెంచుకోండి.! కరోనా నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.!

by Mohana Priya

Ads

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోంది. ఎంతో మంది వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల శరీరంలో ఉండే యంటీబాడీస్ కరోనా వైరస్ తో పోరాడే గుణాన్ని పెంచుకుంటాయి. శరీరంలో ఉండే యాంటీబాడీస్ సంఖ్య పెరుగుతుంది.

Video Advertisement

Tips to increase antibodies

వాక్సిన్ వేసుకున్న తర్వాత ఈ యాంటీబాడీస్ ఆరు నెలలే ఉంటాయి అనే వార్త ప్రచారంలో ఉంది. మనం వేరే పద్ధతులు పాటించడం వల్ల కూడా ఈ యాంటీబాడీస్ ని పెంచుకోవచ్చు. యాంటీబాడీస్ పెరిగే పద్ధతులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Tips to increase antibodies

# ఫ్రూట్స్ బాగా తినాలి. అందులోనూ ముఖ్యంగా విటమిన్ ఏ, సీ, ఈ ఉండే పండ్లు బాగా తినాలి. నారింజ, ద్రాక్ష, కమల, బత్తాయి లాంటి పుల్లగా ఉండే పండ్లు తింటే యాంటీబాడీస్ పెరుగుతాయి.

Tips to increase antibodies

# విటమిన్ డి పెరగాలి. అంటే ఉదయం పూట కానీ, సాయంత్రం పూట కానీ మనకు ఎండ తగిలేలా చూసుకోవాలి. అలాగే డాక్టర్ సలహాతో విటమిన్ డి టాబ్లెట్ లు తీసుకోవాలి.

Tips to increase antibodies

# ప్రొటీన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తినాలి. మాంసం, చికెన్, గుడ్లు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే జీడిపప్పు, బాదం వంటివి కూడా తీసుకోవాలి. ఇవి ఎక్కువగా తింటే వేడి ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెం తినాలి.

Tips to increase antibodies

# వ్యాయామం చేయాలి. కనీసం ఒక అరగంట లేదా పది నిమిషాలైనా నడవాలి.   శారీరక శ్రమ ఉండాలి. కానీ ఎక్కువగా గంటల తరబడి జిమ్ లో ఎక్సర్సైజ్ చేయొద్దు. దాని వల్ల వైట్ బ్లడ్ సెల్స్  కి సమస్య వస్తుంది.

Tips to increase antibodies

# ఉడకబెట్టినవి ఎక్కువగా తినాలి. ఆలివ్ ఆయిల్, లేదా కనోలా ఆయిల్ తో వండుకుని తినాలి. అంతే కాకుండా మొలకలు లాంటివి కూడా ఎక్కువగా తినాలి. ఫ్రైస్, బేక్ చేసిన ఐటమ్స్, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండేవి, ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి అవాయిడ్ చేయాలి.

Tips to increase antibodies

# మద్యానికి దూరంగా ఉండాలి. మద్యం వల్ల యాంటీబాడీస్ తగ్గే అవకాశాలు ఉంటాయి.

Tips to increase antibodies

# అన్నిటికంటే ముఖ్యంగా ఒత్తిడి తగ్గించుకోవాలి. యోగా వంటివి చేయాలి. లేదా స్ట్రెస్ తగ్గడానికి ఇష్టమైన పనులు ఏమైనా చేయాలి. టెన్షన్ పడితే వచ్చే ఒత్తిడి, స్ట్రెస్ వల్ల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

Tips to increase antibodies


End of Article

You may also like