సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత చేసిన మొదటి సినిమా విరూపాక్ష. హిట్లు ప్లాప్ లతో సతమతం అవుతున్న సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. హారర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాకు విడుదలైన రోజు నుంచి ఊహించని విధంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
Video Advertisement
సాయి ధరమ్ తేజ్ సినీ కెరీర్ లో 15వ చిత్రంగా వచ్చిన ఈ మూవీ తో కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు నిర్మించాయి.విడుదలకు ముందే ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రూ. 22.20 కోట్ల బిజినెస్ అయింది.
దానికి తగ్గట్టే ఈ చిత్రం అంచనాలను అందుకుంది. విరూపాక్ష సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫలితంగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ పది రోజులకు గాను ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లోనే రూ. 37.76 కోట్లు షేర్, రూ. 76 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. అంటే ఈ సినిమాకు రూ. 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కాగా రూ. 14.76 కోట్ల లాభంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఈ సినిమా బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రీసెంట్ గా వచ్చిన రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి.
మొదటి రోజే 12 కోట్లు వసూల్ చేసిన ఈ సినిమా. . కేవలం నాలుగు రోజుల్లోనే 50 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు పది రోజుల్లో ఏకంగా విరూపాక్ష సినిమా 76 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి అందరికి షాక్ ఇచ్చింది. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.