Ads
“చిత్రం” సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయినా హీరో ఉదయ్ కిరణ్. చిన్న వయసులోనే, ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలోనే హిట్ కొట్టేసాడు. నటనా ప్రతిభ ఉన్న వ్యక్తి గానే కాదు, వ్యక్తిగతం గా కూడా ఉదయ్ కిరణ్ మంచి మనసున్న మనిషి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చాడు. కష్టపడి పైకి వచ్చాడు. మొదటి మూడు సినిమాలతోనే స్టార్ హీరో అయ్యాడు. ఉదయ్ కిరణ్ మొదటి సినిమా “చిత్రం”, రెండవ సినిమా “నువ్వు నేను”, మూడవ సినిమా “మనసంతా నువ్వే’ సినిమాలు బ్లాక్ బస్టర్ లు అయ్యాయి. అప్పట్లో హీరోలు నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ లకు ఝలక్ ఇచ్చాడు ఉదయ్ కిరణ్.
Video Advertisement
మనశాంతనువ్వే తరువాత ‘శ్రీరామ్’, ‘కలుసుకోవాలని’ సినిమాలు కూడా బాగానే ఆడాయి. ఆ తరువాత పరిస్థితులన్నీ మారిపోతూ వచ్చాయి. ‘నీ స్నేహం’ ‘నీకు నేను నాకు నువ్వు’ ‘ఔనన్నా కాదన్నా’ సినిమాలు హిట్ అయ్యాయి కానీ, చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ తరువాత ఏ సినిమా పెద్దగా ఆడలేదు. ప్రేక్షకులు కూడా పట్టించుకోవడం మానేశారు. దీనితో ఉదయ్ కిరణ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఊహించని విధం గా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. అతని ఆత్మహత్య వెనుక కారణాలు తెలియవు కానీ, ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకోకపోయి ఉంటె కొన్ని పెండింగ్ లో ఉన్న సినిమాలు పూర్తి అయ్యేవేమో. ఆ సినిమాలతో ఉదయ్ కిరణ్ రేంజ్ మరోలా ఉండేది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
#1 ఉదయ్ కిరణ్ , త్రిష హీరో హీరోయిన్లు గా ‘జబ్ వుయ్ మెట్’ అనే సినిమాని రీమేక్ చేద్దాం అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఇది ముందుకు నడవలేదు.
#2 బాలకృష్ణ సౌందర్య కీలక పాత్రలు పోషిస్తూ ‘నర్తన శాల’ ను తీయాలనుకున్నారు. ఈ సినిమాలో ఉదయకిరణ్ ను అభిమన్యుడిగా నటించాలని కోరారట. కానీ, ఈ సినిమా కూడా వాయిదా పడింది. సౌందర్య గారు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం తో ఈ సినిమా మొత్తానికే ఆగిపోయింది.
#3 ప్రముఖ సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ సదా , ఉదయ్ కిరణ్ లను హీరో, హీరోయిన్లు గా “లవర్స్” మూవీ ని ప్లాన్ చేసింది. కానీ ఎందుకనో ఇది కూడా ముందుకు సాగలేదు.
#4 భిన్నమైన చిత్రాలకు పేరు గాంచిన దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. ఆయన కూడా ఉదయ్ కిరణ్ తో ఒక సినిమా తీయాలని అనుకున్నారట. అది కూడా వర్క్ అవుట్ కాలేదు.
#5 “నీ స్నేహం”, “మనసంతా నువ్వే” లాంటి హిట్ సినిమాలు వచ్చాక, ఎం ఎస్ రాజు ఉదయ్ కిరణ్ ఓ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చారట. అయితే, అది కూడా కాన్సల్ అయిపొయింది.
#6 ఉదయకిరణ్ కష్టకాలం లో ఉన్నపుడు దర్శకుడు తేజ ఓ మంచి హిట్ ను తీయాలని, నిర్మాణం కూడా తానె చేయాలనీ భావించాడట. అయితే, అది మొదలు కాకుండానే ఉదయ్ కిరణ్ వెళ్ళిపోయాడు.
#7 ఉదయ్ కిరణ్ “ఆది శంకరాచార్య’ అనే ఓ సినిమా ను చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా నిర్మాత ఆర్ధిక సమస్యల కారణం గా ఇది కూడా వాయిదా పడింది.
#8 పూరి జగన్నాధ్ కూడా ఉదయ్ కిరణ్ తో ఓ మూవీ ప్లాన్ చేశారట. అంజనా ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా తీయాల్సి ఉంది. కానీ ఈ సినిమా కూడా పట్టాలెక్కలేదు.
#9 ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం కూడా ఉదయ్ కిరణ్ తో ‘ప్రేమంటే సులువుకాదురా’ అనే సినిమా తీయడం మొదలు పెట్టారు. దాదాపు 40 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అనుకోని కారణాల వల్ల ఈ సినిమా నిలిచిపోయింది.
#10 కిరణ్, అంకిత హీరో హీరోయిన్లు గా ఓ ప్రాజెక్ట్ మొదలైంది. ప్రత్యూష్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందాల్సి ఉంది. కానీ ఎందుకనో, ఇది కూడా ఆగిపోయింది.
End of Article