ప్రామిస‌రీ నోట్ రాసేటప్పుడు ఈ 10 విషయాలు తప్పక గుర్తుపెట్టుకోవాలి…లేదంటే అప్పు ఎగ్గొట్టినా ఏం చేయ‌లేరు.!

ప్రామిస‌రీ నోట్ రాసేటప్పుడు ఈ 10 విషయాలు తప్పక గుర్తుపెట్టుకోవాలి…లేదంటే అప్పు ఎగ్గొట్టినా ఏం చేయ‌లేరు.!

by Megha Varna

Ads

మనిషి మాట తర్వాత అంతగా విలువ ఇచ్చేది ప్రామిసరీ నోటు కే. ఒకసారి మనిషి ఇచ్చే మాట కంటే కూడా ఎక్కువ విలువ దానికే ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద ఒప్పందాలు ఏమైనా చేసుకునేది ఉంటే ప్రామిసరీ నోటు తప్పనిసరిగా వాడతారు. ఆ నోటు ఉంటే ఇంక తమకు చెందిన దాన్ని వేరే వాళ్ళు చచ్చినా తీసుకోలేరు అనుకుంటారు. కానీ ఆ ప్రామిసరీ నోట్ రాయడానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు చెప్పబోయే రూల్స్ పాటిస్తేనే ఆ ప్రామిసరీ నోట్ చెల్లుతుంది. promissory note validity in telugu

Video Advertisement

  • అప్పు ఇచ్చే వాళ్ళు అప్పు తీసుకునే వాళ్ళు ఇద్దరికీ కచ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలి. లేకపోతే ఆ ప్రామిసరీ నోటు చెల్లదు.
  • ప్రామిసరీ నోటు తయారు చేసేటప్పుడు ఇచ్చే వాళ్ళు తీసుకునే వాళ్ళు కచ్చితంగా అక్కడ ఉండాలి.
  • ప్రామిసరీ నోట్ చెల్లే వ్యవధి మూడు సంవత్సరాలు.
  • నోట్ మీద రెవెన్యూ స్టాంప్ అంటించి దానిపై అడ్డంగా సంతకం చేయాలి.
  • ఆ రెవెన్యూ స్టాంప్ ధర మినిమం ఒక రూపాయి ఉండాలి.
  • ప్రామిసరీ నోట్ పై కోటి రూపాయల వరకు అప్పుగా ఇవ్వచ్చు.

  • అలా ఎక్కువ మొత్తంలో డబ్బు లావాదేవీలు ఉంటే న్యాయవాదిని కచ్చితంగా తీసుకెళ్లాలి.
  • నేను ఫలానా వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాను. తిరిగి ఆ వ్యక్తి కి గాని లేదా తను సూచించిన మరో వ్యక్తి కి గాని అప్పు గా తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేస్తాను. అనే పాయింట్ లేకపోతే ఆ ప్రామిసరీ నోట్ తయారు చేయించినా కూడా ఉపయోగం ఉండదు.

  • మతిస్థిమితం లేని వ్యక్తులు ప్రామిసరీ నోటు రాస్తే ఆ నోట్లు చెల్లదు.
  • ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బును ఇవ్వకపోతే ఆ ప్రామిసరీ నోట్ తో డబ్బును తిరిగి వసూలు చేయవచ్చు.

ఇవి ప్రామిసరీ నోట్ తయారు చేసేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాలు.

 

 


End of Article

You may also like