Ads
90 లో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే నిజంగా బాల్యం అనేది ఎలా ఉంటుందో తెలిసిన చివరి జనరేషన్ వాళ్లే. అప్పుడు దొరికిన ఎన్నో వస్తువులు, వాటితో ఏర్పడిన జ్ఞాపకాలు ఇప్పుడు ఎంత డబ్బులు పెట్టి కొన్నా కూడా దొరకవు. ముఖ్యంగా తినే వస్తువులు. అవి ఆరోగ్యానికి మంచివా కావా అనే విషయం పక్కన పెడితే వాటికి ఇప్పటికీ అంతే క్రేజ్ ఉంటుంది. అందులో కొన్ని ఇవి.
Video Advertisement
#1 జెల్లీ
ఇది ఎక్కువగా కప్ షేప్ లో దొరికేవి. ఆరెంజ్, గ్రీన్, ఎరుపు, పసుపు రంగుల్లో ఎక్కువగా ఉండేవి. మామూలు చాక్లెట్ అంటే చూడడానికి వేరుగా, మెత్తగా ఉండడంతో వీటిని చూస్తే ఇంకా ఎగ్జైటింగ్గా అనిపించింది.
#2 కచ్చా మాంగో బైట్
దీని అడ్వర్టైజ్మెంట్ వెరైటీ గా ఉండేది. ఒక పిల్లాడు వెళ్లి జిరాక్స్ షాప్ ఓనర్ కి ఒక పచ్చి మామిడికాయ ఇచ్చి జిరాక్స్ తీయమని చెప్తాడు. షాప్ అతను అలాగే జిరాక్స్ మెషిన్ లో పెడతాడు అప్పుడు కచ్చా మాంగో బైట్ చాక్లెట్లు వస్తాయి. పచ్చి మామిడి పండు కి జిరాక్స్ అనేది ఆ చాక్లెట్ క్యాప్షన్. కానీ తర్వాత చాలామంది నిజంగా అలా జిరాక్స్ మెషిన్ లో మామిడి కాయ పెడితే చాక్లెట్లు వస్తాయని లేదా ఒక కచ్చా మాంగో బైట్ తీసుకెళ్లి జిరాక్స్ మెషిన్ లో పెడితే అలాంటివి ఇంకా కొన్ని చాక్లెట్ వస్తాయి అని అనుకునే వాళ్లు.
#3 హాజ్మోలా
చూడడానికి టాబ్లెట్ల లాగా మరి తీయగా కాకుండా మరి పుల్లగా కాకుండా ఉండేవి.
#4 మహాలాక్టో
మిగిలిన చాక్లెట్ల కంటే గట్టిగా ఉండేవి. అందుకే ఎక్కువ మంది వీటిని చప్పరించకుండా కొరికేసే వాళ్ళు. అలా కొరికినప్పుడు వచ్చే సౌండ్ మీకు ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది.
#5 ఆశా చాక్లెట్
అసలు 90కి రాజు లాంటిది ఆశ చాక్లెట్. స్కూల్లో ఉన్నప్పుడు ఎవరి పుట్టినరోజు అయినా ఎక్కువగా ఇవే చాక్లెట్లు పంచేవాళ్లు.
#6 క్యాడ్బరీ ఎక్లైర్స్
ఇది చిన్న చాక్లెట్ల లో డైరీ మిల్క్ లాంటిది. అంటే ఈ చాక్లెట్ డైరీ మిల్క్ కంపెనీ వాళ్ళదే అనుకోండి. ఇందాక చెప్పినట్టు ఆశ చాక్లెట్ రాజు అయితే ఈ చాక్లెట్ రాణి అన్నమాట.పుట్టినరోజు నాడు ఈ చాక్లెట్లు పంచితే ఏదో గొప్ప వాళ్ళ ని చూసినట్టు చూసేవాళ్ళు.
#7 పాప్పిన్స్
దీంట్లో ఏ రంగు కావాలి అన్న దానికోసం మీ స్నేహితులతోనో లేదా సోదరులతోనో గొడవ పడడం లేదా ఒప్పందాలు వేసుకోవడం చేసే ఉంటారు కదా.
#8 కాఫీ బైట్
చాక్లెట్లు తియ్యగా పుల్లగా నే కాదు చేదుగా కూడా ఉంటాయి అని చెప్పిన మొట్టమొదటి చాక్లెట్.
#9 మెలోడీ
అప్పటినుండి ఇప్పటివరకు జవాబు దొరకని ప్రశ్న ఒక్కటే ” మెలోడీ ఇంత చాక్లెటీ గా ఎందుకు ఉంటుంది?”
#10 పిక్నిక్
ఎన్ని రకాల చిప్స్ వచ్చినా కానీ దీనికి ఉండే టేస్టే వేరు. వేరే దేనికి ఈ రుచి ఉండదు రాదు కూడా.
#11 చీటోస్
ఇది వీటి రుచి కంటే వీటిల్లో ఉండే త్రీడీ కార్డుల కోసమే ఎక్కువ కొనేవాళ్ళు. ఒక వైపు తిప్పితే ఒక కార్టూన్ క్యారెక్టర్ మరో వైపు తిప్పితే ఇంకో కార్టూన్ క్యారెక్టర్ కనిపించేది. చేతిలోనే త్రీడీ సినిమా చూసినంత ఫీల్ వచ్చేది.
#12 పెప్సీ కోలా
ఇవి ఆరోగ్యానికి మంచివి కావు అని. వీటిలో వాడే ఐస్ శుభ్రమైనది కాదు అని, కెమికల్స్ కలుపుతారు అని అనేవాళ్ళు. కానీ ఒక్క సారి వీటిని చూస్తే అవన్నీ మర్చిపోయి కొనుక్కునేవాళ్లు.
#13 కుల్ఫీ
వేసవి కాలం 2 గంటల సమయం అప్పుడు ఒక గంట మోగేది. రెండు రూపాయలకి ఒక కుల్ఫీ ఇచ్చేవాడు. అది జారిపోకుండా, కిందపడకుండా, కరిగిపోకుండా తినడం అనేది దాదాపు ఒక యుద్ధం లాంటిదే.
#14 నారింజ మిఠాయి
దీన్ని పిల్లలు మాత్రమే కాదు పెద్దవాళ్లు కూడా చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వాటి రుచి అలాంటిది.
#15 బైట్స్
చూడడానికి బిస్కెట్ లాగా ఉండేది తింటే చాక్లెట్ లాగా ఉండేది. కానీ చాక్లెట్ కంటే కూడా కొంచెం చిన్నగా ఉండేది.
ఒక్కసారిగా చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తొచ్చి ఉంటాయి కదా? కానీ ఇవన్నీ ఇప్పుడు బయట ఎక్కువగా దొరకట్లేదు. ఏదైనా ఆన్లైన్ లో దొరుకుతుంది అన్నట్లు అయిపోయింది పరిస్థితి. నిజమే అనుకోండి. అందుకే పైన చెప్పిన వాటిలో చాలా వరకు ఆన్లైన్ లో ఉన్నాయి. కావాలంటే ఒకసారి మీరు కూడా వెతకండి.
End of Article